Telugu Global
Cinema & Entertainment

గోవాలో సర్కారువారి పాట షూటింగ్

సర్కారువారి పాట యూనిట్ గ్యాప్ ఇవ్వడం లేదు. మొన్నటికిమొన్న బ్లాస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టీమ్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోవాలో ల్యాండ్ అయిపోయింది. ప్రస్తుతం గోవాలో మహేష్ బాబుపై ఓ యాక్షన్ సీన్ తీస్తున్నారు. దీనికి సంబంధించి వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. దర్శకుడు పరశురామ్, మహేష్ బాబుకు యాక్షన్ సీన్ ను వివరిస్తుంటే.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్షణ్ దీక్షగా వింటున్నారు. ఎప్పట్లానే ఈ స్టిల్ లో మహేష్ బాబు మరోసారి అదరగొట్టాడు. […]

గోవాలో సర్కారువారి పాట షూటింగ్
X

సర్కారువారి పాట యూనిట్ గ్యాప్ ఇవ్వడం లేదు. మొన్నటికిమొన్న బ్లాస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టీమ్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోవాలో ల్యాండ్ అయిపోయింది. ప్రస్తుతం గోవాలో మహేష్ బాబుపై ఓ యాక్షన్ సీన్ తీస్తున్నారు. దీనికి సంబంధించి వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు.

దర్శకుడు పరశురామ్, మహేష్ బాబుకు యాక్షన్ సీన్ ను వివరిస్తుంటే.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్షణ్ దీక్షగా వింటున్నారు. ఎప్పట్లానే ఈ స్టిల్ లో మహేష్ బాబు మరోసారి అదరగొట్టాడు. అతడి డ్రెస్, లుక్ చాలా బాగుంది. దీంతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీక‌రిస్తారు. ఈ గోవా షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

ఇక బ్లాస్టర్ విషయానికొస్తే, మహేష్ బాబు యాటిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. అన్ని అంశాల‌తో ఓ ఎంట‌ర్‌టైనింగ్ రోల్‌లో, మ‌హేశ్‌ను ఎలివేట్ చేసిన తీరు చూసి డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంను ప్రేక్ష‌కాభిమానులు అప్రిషియేట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

First Published:  14 Aug 2021 7:25 AM IST
Next Story