Telugu Global
Health & Life Style

భారత్ లో టీకా సామర్థ్యంపై ఆసక్తికర అధ్యయనం..

కొవిడ్ నివారణకు ఇంకా మందు తయారు కాలేదు, రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట్లో అజిత్రోమైసిన్ తో అంతా మాయమైపోతుందన్నారు, మలేరియా మందులు పనికొస్తాయని చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో స్టెరాయిడ్స్ ని విచ్చలవిడిగా వినియోగించారు. కానీ ఇప్పటి వరకు కొవిడ్ నివారణకు నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదు. కొవిడ్ కట్టడికి వచ్చిన వ్యాక్సిన్ పై కూడా చాలామందిలో అపోహలున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా సామాజిక దూరం పాటించాలి, మాస్క్ వాడాలి, శానిటైజర్ వాడాలంటూ జరిగిన ప్రచారం కూడా వాటికి […]

భారత్ లో టీకా సామర్థ్యంపై ఆసక్తికర అధ్యయనం..
X

కొవిడ్ నివారణకు ఇంకా మందు తయారు కాలేదు, రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట్లో అజిత్రోమైసిన్ తో అంతా మాయమైపోతుందన్నారు, మలేరియా మందులు పనికొస్తాయని చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో స్టెరాయిడ్స్ ని విచ్చలవిడిగా వినియోగించారు. కానీ ఇప్పటి వరకు కొవిడ్ నివారణకు నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదు. కొవిడ్ కట్టడికి వచ్చిన వ్యాక్సిన్ పై కూడా చాలామందిలో అపోహలున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా సామాజిక దూరం పాటించాలి, మాస్క్ వాడాలి, శానిటైజర్ వాడాలంటూ జరిగిన ప్రచారం కూడా వాటికి బలం చేకూర్చింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొవిడ్ బారిన పడినవారి ఉదాహరణలూ ఉన్నాయి. అయితే ఇలా వ్యాక్సినేషన్ తర్వాత కొవిడ్ సోకడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.

కేవలం 0.048 శాతం మాత్రమే.
టీకా తర్వాత కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.14కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. వారిలో కేవలం 0.048శాతం మందికి మాత్రమే కొవిడ్ సోకిందని ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. అంటే అంటే దాదాపు 2.6లక్షల మంది మాత్రమే టీకా పొందిన తర్వాత కూడా కరోనాబారిన పడ్డారు. 1,71,511 మందికి తొలి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్‌ సోకగా.. 87వేల మంది రెండు డోసులు వేయించుకున్న తర్వాత కూడా వైరస్‌ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ ముప్పు లేనట్టే..!
వ్యాక్సినేషన్‌ తర్వాత వైరస్‌ సోకడాన్ని బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్‌గా పిలుస్తారు. టీకా తీసుకున్న తర్వాత ఇలా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారిన పడినా, వారిలో ప్రాణాపాయ ముప్పు తక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు కొవిడ్ సోకడం కూడా తక్కువేనని తాజా అధ్యయనం చెబుతోంది.

టీకా తీసుకున్నవారు కొవిడ్‌ బారిన పడే అవకాశాలు చాలా తక్కువే అయినా, కొరకరాని కొయ్యలుగా మారిన కొత్త వేరియంట్ల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలంటున్నారు.

First Published:  14 Aug 2021 3:12 AM IST
Next Story