Telugu Global
National

మహారాష్ట్రలో ఆగస్ట్ 15నుంచి అన్ లాక్ స్వేచ్ఛ..

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు లాక్ డౌన్ నిబంధనలనుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తామంటోంది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పరిస్థితులు కొంత కుదుటపడినా, ఇతర రాష్ట్రాలు సడలింపులు ఇచ్చాయి కానీ, మహారాష్ట్ర మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తోంది. అయితే మహా ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ లాక్ లోకి వచ్చేసింది. ఆగస్ట్ 15నుంచి నిబంధనల సడలింపు అమలు చేస్తామంటోంది. 50శాతం పర్మిషన్లు.. […]

మహారాష్ట్రలో ఆగస్ట్ 15నుంచి అన్ లాక్ స్వేచ్ఛ..
X

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు లాక్ డౌన్ నిబంధనలనుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తామంటోంది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పరిస్థితులు కొంత కుదుటపడినా, ఇతర రాష్ట్రాలు సడలింపులు ఇచ్చాయి కానీ, మహారాష్ట్ర మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తోంది. అయితే మహా ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ లాక్ లోకి వచ్చేసింది. ఆగస్ట్ 15నుంచి నిబంధనల సడలింపు అమలు చేస్తామంటోంది.

50శాతం పర్మిషన్లు..
– మహారాష్ట్రలో సవరించిన నిబంధనల ప్రకారం రాత్రి 10వరకు అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతి
– హోటళ్లు, రెస్టారెంట్లు యాభైశాతం సీటింగ్ తో నడుపుకునేందుకు వెసులుబాటు
– రాత్రి 10 గంటల వరకు షాపింగ్ మాల్స్ తెరుచుకునేందుకు అనుమతి
– జిమ్ లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు 50శాతం కెపాసిటీతో రాత్రి 10గంటల వరకు నిర్వహించుకునే అవకాశం.
– ప్రైవేటు ఆఫీసుల్లో 24X7 సేవలు ప్రారంభానికి అనుమతి
– వివాహాది శుభకార్యాలయాలకు ఓపెన్ ఆడిటోరియంలో 200మందికి, ఫంక్షన్ హాళ్లలో 100 మందికి అనుమతి.
– బీచ్ లు, అమ్యూజ్ మెంట్ పార్క్ లు, ప్లే గ్రౌండ్ల నిర్వహణ విషయంలో స్థానిక ప్రభుత్వాలకి నిర్ణయాధికారం..

వీటికి మినహాయింపులు లేవు..
మహారాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ పర్మిషన్ ఇచ్చినా సినిమా హాళ్లకు మాత్రం ఇంకా అనుమతివ్వకపోవడం విశేషం. దీంతో బాలీవుడ్ పై ఆ ప్రభావం గట్టిగా కనపడుతోంది.
సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ లు, రాజకీయ సమావేశాలు, ప్రార్థనా కూటముల పేరుతో జరిగే భక్తి కార్యక్రమాలకు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కస్టమర్లు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే మాల్స్ లోనికి ప్రవేశం కల్పించాలని సూచించింది.

First Published:  12 Aug 2021 4:19 PM IST
Next Story