Telugu Global
National

ఐఏఎస్ విడాకులు.. మూడేళ్లకే విడిపోయిన మూడు ముళ్లు..

2018లో ప్రేమ వివాహం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ జంట, ఇప్పుడు విడాకులు తీసుకుని మరోసారి సంచలనంగా మారారు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి మరీ మతాంతర వివాహం చేసుకున్న టీనా దాబి, అథార్ అమీర్ ఖాన్.. వేరుపడ్డారు. గతేడాది నవంబర్ లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. జైపూర్ ఫ్యామిలీ కోర్టు తాజాగా వీరికి డైవోర్స్ మంజూరు చేసింది. రాజస్తాన్‌ కు చెందిన టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించారు. సివిల్స్‌ పరీక్షలో […]

ఐఏఎస్ విడాకులు.. మూడేళ్లకే విడిపోయిన మూడు ముళ్లు..
X

2018లో ప్రేమ వివాహం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ జంట, ఇప్పుడు విడాకులు తీసుకుని మరోసారి సంచలనంగా మారారు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి మరీ మతాంతర వివాహం చేసుకున్న టీనా దాబి, అథార్ అమీర్ ఖాన్.. వేరుపడ్డారు. గతేడాది నవంబర్ లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. జైపూర్ ఫ్యామిలీ కోర్టు తాజాగా వీరికి డైవోర్స్ మంజూరు చేసింది.

రాజస్తాన్‌ కు చెందిన టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించారు. సివిల్స్‌ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా ఆమె పేరు అప్పట్లో మారుమోగింది. అదే ఏడాది జమ్మూ కాశ్మీర్‌ కు చెందిన అథార్‌ అమీర్ ఖాన్‌ కి రెండో ర్యాంక్ వచ్చింది. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐఏఎస్ అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయినా వారు వెనకడుగు వేయకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ జంటను ఆశీర్వదించారు. పెళ్లైన తర్వాత వీరిద్దరూ కొన్నాళ్లు జైపూర్ లో విధులు నిర్వహించారు.

విధి నిర్వహణలో ఇద్దరూ మంచి పేరు సాధించారు. కానీ నిజ జీవితంలో మాత్రం వీరు కలసి ఉండలేకపోయారు. పెళ్లైన మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. జైపూర్ ఫ్యామిలీ కోర్టులో గతేడాది నవంబర్ లో వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం టీనా జైపూర్ లోనే విధులు నిర్వహిస్తుండగా.. అథార్‌ మాత్రం డిప్యుటేషన్‌ పై తన సొంతరాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌ వెళ్లారు. శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

First Published:  11 Aug 2021 2:25 PM IST
Next Story