Telugu Global
Cinema & Entertainment

రాజరాజ చోరుడు వచ్చేస్తున్నాడోచ్

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌, పాట‌లు స‌హా ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇదే ఊపులో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఆగ‌స్ట్ 19న రాజరాజచోర సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ హాయిగా న‌వ్వుకోవాల‌ని, మంచి సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నారు. `రాజ రాజ చోర‌` అలాంటి […]

రాజరాజ చోరుడు వచ్చేస్తున్నాడోచ్
X

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రాజ రాజ చోర‌'. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌, పాట‌లు స‌హా ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇదే ఊపులో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఆగ‌స్ట్ 19న రాజరాజచోర సినిమా
థియేటర్లలోకి రాబోతోంది. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ హాయిగా న‌వ్వుకోవాల‌ని,
మంచి సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నారు. 'రాజ రాజ చోర‌' అలాంటి నవ్వుల్ని, పూర్తి వినోదాన్ని
అందిస్తుందంటున్నారు మేకర్స్.

'రాజ‌రాజ చోర‌' చిత్రంలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. మేఘా ఆకాశ్
మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా సునైన క‌నిపించ‌నుంది. హితేశ్ గోలి
ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని
నిర్మించారు. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు. సినిమాలో గంగవ్వ ఓ కీలక పాత్ర పోషించింది.

First Published:  11 Aug 2021 12:23 PM IST
Next Story