మహేష్ తో 'షుగర్ ఫ్యాక్టరీ' నిజమేనా?
ఆమధ్య మహేష్ బాబు సినిమాల లిస్ట్ లో షుగర్ ఫ్యాక్టరీ అనే పేరు వినిపించింది. చెప్పుకోవడానికి కాస్త కామెడీగా కూడా అనిపించింది. కొంతమంది ఇతర హీరోల ఫ్యాన్స్ దీనిపై ట్రోలింగ్ కూడా చేశారు. మహేష్ సినిమాకు ఆ టైటిల్ ఏంటంటూ ఎద్దేవా చేశారు. అయితే అదంతా పుకారు అని, అలాంటి టైటిల్ ఎందుకు పెడతారంటూ మహేష్ ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగారు. కట్ చేస్తే.. ఆ టైటిల్ అనుకున్న మాట నిజమేనని ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. […]
ఆమధ్య మహేష్ బాబు సినిమాల లిస్ట్ లో షుగర్ ఫ్యాక్టరీ అనే పేరు వినిపించింది. చెప్పుకోవడానికి కాస్త
కామెడీగా కూడా అనిపించింది. కొంతమంది ఇతర హీరోల ఫ్యాన్స్ దీనిపై ట్రోలింగ్ కూడా చేశారు. మహేష్
సినిమాకు ఆ టైటిల్ ఏంటంటూ ఎద్దేవా చేశారు. అయితే అదంతా పుకారు అని, అలాంటి టైటిల్ ఎందుకు
పెడతారంటూ మహేష్ ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగారు.
కట్ చేస్తే.. ఆ టైటిల్ అనుకున్న మాట నిజమేనని ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మహేష్ తో సినిమా కోసం ఆమధ్య చర్చలు జరిగిన ఈ దర్శకుడు.. తన దగ్గర షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ తో ఓ కథ ఉందని నిర్థారించాడు. అయితే ఆ కథ మహేష్ కోసం అనుకున్నది కాదని స్పష్టంచేశాడు. తను రాసుకున్న మొట్టమొదటి కథ షుగర్ ఫ్యాక్టరీ అని స్పష్టంచేశాడు.
షుగర్ ఫ్యాక్టరీ కాకుండా మహేష్ కు వేరే కథ వినిపించినట్టు తెలిపాడు సందీప్ రెడ్డి వంగ. ఆ కథతోనే మహేష్ తో సినిమా చేస్తానంటున్నాడు. తను చెప్పిన స్టోరీలైన్ ను మహేష్ రిజెక్ట్ చేయలేదని, కేవలం టైమ్ లేక మాత్రమే ప్రాజెక్టు లేట్ అవుతోందని స్పష్టంచేశాడు.