Telugu Global
National

వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా కమ్మేసింది. అయితే వైరస్ వ్యాప్తి ఒక్కో దేశంలో ఒకలా ఉంది.అందుకే వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న దేశాలు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ఎవరైనా వస్తుంటే వ్యాక్సిన్ వేసుకుంటూనే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కీలకంగా మారింది. విదేశాల నుంచి రాకపోకలు సాగించే ఉద్యోగులకు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్ ఇప్పుడు […]

వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
X

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా కమ్మేసింది. అయితే వైరస్ వ్యాప్తి ఒక్కో దేశంలో ఒకలా ఉంది.అందుకే వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న దేశాలు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ఎవరైనా వస్తుంటే వ్యాక్సిన్ వేసుకుంటూనే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కీలకంగా మారింది. విదేశాల నుంచి రాకపోకలు సాగించే ఉద్యోగులకు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్ ఇప్పుడు చాలా అవసరం.

కాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకునే ప్రక్రియ మరింత సులభతరం చేశారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా సర్టిఫికెట్ పొందే సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. ముందుగా మైగౌ కరోనా హెల్ప్ డెస్క్ నంబర్ అయిన 9013151515 ను మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత వాట్సాప్ నుంచి ‘డౌన్లోడ్ సర్టిఫికెట్’ అనే మెసేజ్ ను మొబైల్లో సేవ్ చేసుకున్న హెల్ప్ డెస్క్ నంబర్ కు పంపాలి.

అప్పుడు ఆ నంబర్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. దానిని తిరిగి అదే నంబర్ కు సెండ్ చేయగానే వ్యాక్సిన్ వేయించుకున్న వారి పేర్ల జాబితా, వరుస నంబర్లతో కనబడుతుంది. ఏ వరుస నంబర్ కు సంబంధించిన సర్టిఫికెట్ అవసరమో ఆ వరుస నంబర్ ను సెలెక్ట్ చేసుకుని మెసేజ్ పంపగానే క్షణాల్లోనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తుంది.

మనం ఈ సర్టిఫికెట్ ను దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ నుంచి ఎన్ని సార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో సర్టిఫికెట్ మర్చిపోయామన్న చింత అవసరం లేదు.అవసరం అయిన ప్రతిసారి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. మైగౌ కరోనా హెల్ప్ డెస్క్ నెంబర్ ను సంప్రదించి పలు సలహాలు కూడా పొందవచ్చు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర విషయాలు కూడా పొందవచ్చు.

First Published:  9 Aug 2021 4:53 AM IST
Next Story