Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట.. బ్లాస్ట్ అదిరింది

మ‌హేశ్ హీరోగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `స‌ర్కారువారి పాట‌`. భారీ అంచ‌నాల‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు ` బ్లాస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మహేష్ పుట్టినరోజు స్పెషల్ వీడియో ఇది. మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న ఈ బ్లాస్ట‌ర్ విడుద‌ల‌తో సినిమాపై ఉన్న భారీ అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. మ‌హేశ్ ల‌గ్జ‌రీ కారు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, విల‌న్స్‌తో పంచ్ డైలాగ్స్ మాట్లాడటం, వారిని చిత‌క్కొట్ట‌డం వంటి స‌న్నివేశాలున్నాయి. ఇక మ‌హేశ్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. చెవి […]

సర్కారువారి పాట.. బ్లాస్ట్ అదిరింది
X

మ‌హేశ్ హీరోగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'స‌ర్కారువారి పాట‌'. భారీ అంచ‌నాల‌తో
వస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు ' బ్లాస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మహేష్ పుట్టినరోజు స్పెషల్ వీడియో ఇది.

మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న ఈ బ్లాస్ట‌ర్ విడుద‌ల‌తో సినిమాపై ఉన్న భారీ అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. మ‌హేశ్ ల‌గ్జ‌రీ కారు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, విల‌న్స్‌తో పంచ్ డైలాగ్స్ మాట్లాడటం, వారిని చిత‌క్కొట్ట‌డం వంటి స‌న్నివేశాలున్నాయి. ఇక మ‌హేశ్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. చెవి పోగు, పొడ‌వాటి జుట్టు, చెవి వెనుక‌భాగాన రూపాయి బిళ్ల టాటూ.. ఇలా ట్రెండీ ఔట్‌ఫిట్‌తో మ‌హేశ్ మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో క‌నిపిస్తున్నాడు.

మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అమేజింగ్ యాక్ష‌న్
సీక్వెన్స్‌ల‌తో బ్లాస్ట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఇక ఫ్యాన్స్ చేసుకుంటున్న సెల‌బ్రేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మ‌హేశ్ అందాన్ని చూసి ప్రేక్ష‌కులు ఎలా ముగ్దుల‌వుతున్నారో, బ్లాస్ట‌ర్‌లో హీరోయిన్ కీర్తిసురేశ్ కూడా అలాగే
ఫీలైంది. వెన్నెల కిశోర్ పాత్ర‌తో సినిమాలో న‌వ్వుల‌కు కొద‌వుండ‌ద‌ని టీజ‌ర్‌లో చెప్పేశారు. వ‌చ్చే ఏడాది
సంక్రాంతి స్పెష‌ల్‌గా జ‌న‌వరి 13న విడుద‌ల‌వుతుంది సర్కారువారి పాట.

First Published:  9 Aug 2021 1:28 PM IST
Next Story