Telugu Global
National

మిక్సింగ్ టీకా పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు..

ఒకడోస్ కొవిషీల్డ్, మరో డోస్ కొవాక్సిన్.. ఇలా రెండు టీకాలను కలిపి తీసుకుంటే మేలైనా ఫలితాలొస్తాయంటూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్త పరిశోధనలో ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఈ అధ్యయనాన్ని సమీక్షించాల్సి ఉందని, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసిన తర్వాతే ఈ మిక్సింగ్ వ్యాక్సినేషన్ కి అధికారికంగా ఆమోద ముద్ర పడుతుందని చెబుతున్నారు. ఏయే దేశాల్లో మిక్సింగ్ టీకా..? కెనడా, దక్షిణ కొరియా, […]

మిక్సింగ్ టీకా పరిశోధనల్లో ఆసక్తికర ఫలితాలు..
X

ఒకడోస్ కొవిషీల్డ్, మరో డోస్ కొవాక్సిన్.. ఇలా రెండు టీకాలను కలిపి తీసుకుంటే మేలైనా ఫలితాలొస్తాయంటూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సంయుక్త పరిశోధనలో ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఈ అధ్యయనాన్ని సమీక్షించాల్సి ఉందని, దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసిన తర్వాతే ఈ మిక్సింగ్ వ్యాక్సినేషన్ కి అధికారికంగా ఆమోద ముద్ర పడుతుందని చెబుతున్నారు.

ఏయే దేశాల్లో మిక్సింగ్ టీకా..?
కెనడా, దక్షిణ కొరియా, థాయిలాండ్‌, వియత్నాం, ఇటలీ, భూటాన్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, నార్వే, స్పెయిన్‌, స్వీడన్‌, బ్రిటన్‌, అమెరికాలో ఇప్పటికే టీకా మిక్సింగ్‌ ను వ్యాక్సినేషన్ ప్రక్రియలో అమలు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా-ఫైజర్‌ వ్యాక్సిన్లను వేర్వేరు డోసుల్లో తీసుకోవడం వల్ల ఆరు రెట్లు ఎక్కువగా యాంటిబాడీలు వృద్ధి అయ్యాయని దక్షిణ కొరియా అధ్యయనం స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా-ఫైజర్‌ మిక్సింగ్ వల్ల టీ-సెల్స్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయని బ్రిటన్‌ అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా-మోడెర్నా మిక్సింగ్‌ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, మెరుగైన రక్షణ కలుగుతుందని డెన్మార్క్‌ అధ్యయనం పేర్కొంది.

ఇలా విదేశాల్లో టీకా మిక్సింగ్ పై ప్రయోగాలు జరుగుతున్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్‌లో సిద్ధార్థ్‌ నగర్‌ లోని ఓ టీకా కేంద్రంలో జరిగిన పొరపాటు మన దేశంలో సరికొత్త ప్రయోగాలకు అవకాశాన్నిచ్చింది. అక్కడ 18 మందికి తొలి దఫాలో కొవిషీల్డ్‌ టీకా వేయగా, రెండో దఫాలో పొరపాటున కొవాగ్జిన్‌ వేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తగా, వేర్వేరు టీకా డోసులను తీసుకున్న వీరిలో వ్యాక్సిన్‌ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది. దీంతో ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీకి చెందిన నిపుణుల బృందం వీరిపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో మిక్సింగ్‌ టీకా తీసుకున్న 18 మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు. దుష్ప్రభావాలు కూడా దాదాపుగా లేవన్నారు. ఇప్పుడీ పరిశోధన సారాంశం ఆసక్తికరంగా మారింది.

టీకా మిక్సింగ్‌ ఆమోదయోగ్యమే అయినా, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ఇటీవలే స్పష్టం చేశారు. టీకా మిక్సింగ్‌ తో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. ఒక కంపెనీకి చెందిన టీకా అందుబాటులో లేని సమయంలో రెండో డోసుగా వేరే టీకాను వేసుకోవచ్చు. దీంతో టీకా ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ సామర్థ్యం మరింత మెరుగవ్వాల్సిన అవసరముందని, మిక్సింగ్‌ టీకాతో అది మరింత సులభమవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  9 Aug 2021 1:45 AM IST
Next Story