శ్రీవిష్ణు సినిమా షూటింగ్ అప్ డేట్స్
శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా `భళా తందనాన`. ఇంతకుముందు బాణం అనే సినిమాను డైరక్ట్ చేసిన చైతన్య దంతులూరి, మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీవిష్ణు ఇదివరకెప్పుడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత, ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి `భళా తందనాన` చిత్రాన్ని […]
శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'భళా తందనాన'. ఇంతకుముందు బాణం అనే సినిమాను డైరక్ట్ చేసిన చైతన్య దంతులూరి, మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను
తెరకెక్కిస్తున్నాడు. శ్రీవిష్ణు ఇదివరకెప్పుడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత, ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో పునఃప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి 'భళా తందనాన' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. కె.జి.యఫ్ చిత్రంలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 5 పాటలు ఇచ్చేశారు. త్వరలోనే షూటింగ్
పూర్తిచేసి, ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.