క్రేజీ ఓటీటీ డీల్స్.. ఏమౌతుందో చూడాలి
మరోసారి టాలీవుడ్ ను సెకెండ్ వేవ్ గట్టిగా తాకింది. థియేటర్లు తెరిచినప్పటికీ బడా సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితులు లేవు. ప్రేక్షకులు సినిమాహాళ్లను లైట్ తీసుకోవడం ఓ కారణమైతే.. ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు తగ్గించడం ఇంకో కారణం. దీంతో మరోసారి సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టాయి. ఇందులో భాగంగా పలు ఓటీటీ సంస్థలు, క్రేజీ మూవీస్ కు భారీగా ఆఫర్ చేస్తున్నాయి. ఆ డీల్స్ ఏంటో చూద్దాం నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ను ఓటీటీకి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. […]
మరోసారి టాలీవుడ్ ను సెకెండ్ వేవ్ గట్టిగా తాకింది. థియేటర్లు తెరిచినప్పటికీ బడా సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితులు లేవు. ప్రేక్షకులు సినిమాహాళ్లను లైట్ తీసుకోవడం ఓ కారణమైతే.. ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు తగ్గించడం ఇంకో కారణం. దీంతో మరోసారి సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టాయి. ఇందులో భాగంగా పలు ఓటీటీ సంస్థలు, క్రేజీ మూవీస్ కు భారీగా ఆఫర్ చేస్తున్నాయి. ఆ డీల్స్ ఏంటో చూద్దాం
నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ను ఓటీటీకి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ 37 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాకు కూడా చాన్నాళ్లుగా ఓ క్రేజీ ఆఫర్ రెడీగా ఉంది. ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 38 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఆఫర్ రెడీగా ఉంది.
ఇక వెంకటేష్ దృశ్యం-2 సినిమా ఆల్రెడీ అమ్ముడుపోయింది. డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. అటు నితిన్ నటించిన మాస్ట్రో సినిమా డైరక్ట్ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయింది. డిస్నీ హాట్ స్టార్ సంస్థ 28 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అటు సౌత్ ఓటీటీలోకి అడుగుపెట్టిన సోనీ లివ్ సంస్థ కూడా తన తొలి సినిమాను ప్రసారం చేయడానికి సిద్ధమైంది. సత్య హీరోగా నటించిన వివాహ భోజనంబు సినిమాను 3 కోట్ల రూపాయలకు దక్కించుకొని నేరుగా రిలీజ్ చేయబోతోంది.
వీటితో పాటు సీటీమార్, మహాసముద్రం సినిమాలకు కూడా ఓటీటీ ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటిలో
ఎన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతాయో, ఇంకెన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తాయో చూడాలి