Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ పాత్ర ఇదే

చిరంజీవి హీరోగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది లూసిఫర్ రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్నఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఏంటనేది బయటకొచ్చింది. ఒరిజినల్ లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. అదే పాత్రను తెలుగులో సత్యదేవ్ పోషించబోతున్నాడు లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ పాత్రలో విలనీ ఉన్నప్పటికీ చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి విలక్షణమైన పాత్రను సత్యదేవ్ తో చేయించాలని చిరంజీవి […]

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ పాత్ర ఇదే
X

చిరంజీవి హీరోగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది లూసిఫర్ రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్నఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఏంటనేది బయటకొచ్చింది. ఒరిజినల్ లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. అదే పాత్రను తెలుగులో సత్యదేవ్ పోషించబోతున్నాడు

లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ పాత్రలో విలనీ ఉన్నప్పటికీ చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి
విలక్షణమైన పాత్రను సత్యదేవ్ తో చేయించాలని చిరంజీవి భావించారంటే.. ఈ నటుడిపై చిరు ఎంత
నమ్మకం పెట్టుకున్నారో అర్థమౌతోంది. ఓవైపు హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్, కేవలం
చిరంజీవి కోసం లూసిఫర్ లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు. ఆమె అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు ఆమె కాల్షీట్లు
కూడా తీసుకున్నారు. ఇటు సత్యదేవ్, బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు సెట్స్ పైకి వస్తానని
మాటిచ్చాడు. మొత్తానికి లూసిఫర్ రీమేక్ కు సంబంధించి ఇద్దరు కీలక నటుల ఎంపిక పూర్తయింది.

ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పృధ్వీరాజ్ పాత్రకు కూడా నటుడ్ని ఫిక్స్ చేస్తే, దాదాపు కీలక నటీనటుల
ఎంపిక పూర్తయినట్టే. తెలుగులో ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

First Published:  7 Aug 2021 2:21 PM IST
Next Story