మొన్న డేట్.. ఈరోజు టైమ్ చెప్పాడు
మహేష్ బాబు పుట్టినరోజు హంగామా 10 రోజుల కిందటే మొదలైంది. 9వ తేదీన మహేష్ బాబు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ రోజున సర్కారువారి పాట సినిమాకు సంబంధించి హంగామా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడా హంగామాకు సంబంధించి టైమ్ కూడా చెప్పేశారు. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్‌డే స్పెషల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి ఫస్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా […]
మహేష్ బాబు పుట్టినరోజు హంగామా 10 రోజుల కిందటే మొదలైంది. 9వ తేదీన మహేష్ బాబు తన
పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ రోజున సర్కారువారి పాట సినిమాకు సంబంధించి హంగామా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడా హంగామాకు సంబంధించి టైమ్ కూడా చెప్పేశారు.
ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్‌డే స్పెషల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి ఫస్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఇది సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అందులో మహేశ్ లుక్ ఇది వరకెన్నడూ లేనంత కొత్తగా అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈరోజు చిత్ర యూనిట్ బ్లాస్టర్ టైమ్‌ను అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 9న ‘సర్కారువారి పాట’ నుంచి ఆగస్ట్ 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు వీడియో విడుదలవుతున్నట్లు ప్రకటించారు.
మహేష్ కు 9 అంకె సెంటిమెంట్. అందుకే ఆ నంబర్ కలిసొచ్చేలా వీడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
అయితే దీన్ని వీడియో అంటున్నారు తప్ప, అదేంటనేది చెప్పడం లేదు. చూస్తుంటే.. 9న వచ్చేది సినిమా టీజర్ కానట్టుంది. ప్రత్యేకంగా బర్త్ డే కోసం కట్ చేసిన ప్రోమో అయి ఉండొచ్చు.