రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తేవడమే లక్ష్యం
రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండుగ కార్యక్రమంలో వైఎస్సార్‌టిపి చీఫ్ షర్మిల ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కరానికి పోరాడండని కేడర్‌కి పిలుపు తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకుని రావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం లోటస్ పాండ్‌లో “రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండగ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, మైనార్టీలకు […]
- రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండుగ కార్యక్రమంలో వైఎస్సార్‌టిపి చీఫ్ షర్మిల
- ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కరానికి పోరాడండని కేడర్‌కి పిలుపు
తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకుని రావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం లోటస్ పాండ్‌లో “రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండగ” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, తదితర కార్యక్రమాలను వైఎస్సార్ ప్రారంభించినవే అన్నారు. సంక్షేమానికి చెరగని సంతకం చేసిన వ్యక్తి వైఎస్సార్ అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన నుంచే పార్టీ జెండా పుట్టకొచ్చిందని చెబుతూ పార్టీ జెండా డిజైనింగ్ గురించి వివరించారు. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుందని, దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే సంతోషం కలుగుతుందని, అలాగే పార్టీ జెండాను చూస్తే రెట్టింపు సంతోషం కలగాలనే ఉద్దేశంతో పాలపిట్ట రంగును ప్రవేశపెట్టామన్నారు. ఇక నీలిరంగు సమత్వాన్ని సూచిస్తుందన్నారు. సమానత్వం కోసం అంబేడ్కర్ నినాదమే పార్టీ సిద్ధాంతమన్నారు. పాలనలో అందరికీ భాగస్వామ్యం, అన్ని వర్గాలకు సమన్యాయంచేయడమే నీలిరంగు ఉద్దేశం అన్నారు. గ్రామగ్రామాన వైఎస్సార్ జెండా ఎగురవేసి సంక్షేమ పాలన తిరిగి రాబోతోందని అందరికీ చెప్పాలని, వైఎస్సార్ సంక్షేమ ఫలాలు అందుకున్నప్రతి కుటుంబానికి మన జెండా చేరాలని పార్టీ కేడర్‌కి దిశానిర్దేశం చేశారు షర్మిల.
ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ జెండా పండుగను ఊరూరా, గ్రామ గ్రామాన నిర్వహించాలన్నారామె. తెలంగాణలో 35 ఏళ్ళు పైబడినవారందరికీ వైఎస్సార్ చేసిన సంక్షేమ పాలన తెలుసని, అందుకే 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి వైఎస్సార్ సంక్షేమ పాలన ఎలా ఉండేదో చెప్పాలన్నారు. ప్రజలకు వైఎస్సార్ పాలన గుర్తు చేయాలని అంటూ.. చేయిచేయి కలిపితేనే రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురాగలమనే ధీమాను వ్యక్తం చేశారు. మనం పార్టీ పెట్టక ముందే ప్రజల మధ్య ఉండి పోరాటం చేశామని, ఏ ప్రతిపక్షం చేయని విధంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేశామని గుర్తు చేస్తూ.. మీమీ గ్రామాలు, మండలాలు, సొంత నియోజకవర్గాల్లోని సమస్యలను సొంత సమస్యలుగా భావించి ప్రజల పక్షాన పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపునిచ్చారు. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. మనం కష్టపడి పనిచేస్తే ప్రజలు మనల్ని విశ్వసించి, ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం ఇస్తారని ఆమె అన్నారు.