హెర్డ్ ఇమ్యూనిటీతోనే కరోనా కట్టడి..
కరోనా కట్టడికి మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం కంటే.. హెర్డ్ ఇమ్యూనిటీయే సరైన మార్గం అని స్పష్టం చేశారు ఇంగ్లండ్ లోని అలబామా యూనివర్శిటీ పరిశోధకులు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన తర్వాతే కరోనా తొలగిపోతుందని, అప్పటి వరకు అది మన మధ్యనే తిష్టవేసుకుని ఉంటుందని చెప్పారు. గతంలో కరోనా నియంత్రణకు 60నుంచి 70శాతం హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోతుందని అంచనా వేసినా, ఇప్పుడది 80నుంచి 90శాతం అవసరమని తేలినట్టు చెప్పారు. కరోనా సోకి తగ్గిపోవడం వల్ల, వ్యాక్సినేషన్ వల్ల […]
కరోనా కట్టడికి మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం కంటే.. హెర్డ్ ఇమ్యూనిటీయే సరైన మార్గం అని స్పష్టం చేశారు ఇంగ్లండ్ లోని అలబామా యూనివర్శిటీ పరిశోధకులు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన తర్వాతే కరోనా తొలగిపోతుందని, అప్పటి వరకు అది మన మధ్యనే తిష్టవేసుకుని ఉంటుందని చెప్పారు. గతంలో కరోనా నియంత్రణకు 60నుంచి 70శాతం హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోతుందని అంచనా వేసినా, ఇప్పుడది 80నుంచి 90శాతం అవసరమని తేలినట్టు చెప్పారు. కరోనా సోకి తగ్గిపోవడం వల్ల, వ్యాక్సినేషన్ వల్ల రోగ నిరోధక శక్తి ప్రజల్లో పెరిగినప్పుడే వైరస్ ని అరికట్టగలమని స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు..
ప్రస్తుతం ప్రపంచమంతా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మధ్య సంధికాలంలో ఉంది. సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా తగ్గకముందే మళ్లీ తిరగబెట్టాయి. అటు థర్డ్ వేవ్ అని చెప్పుకోడానికి కొత్త వేయిరంట్ రాలేదు, కొత్త లక్షణాలేవీ కనపడలేదు. కానీ సెకండ్ వేవ్ లో ఉన్న డెల్టా వేరియంట్ ఇప్పుడు మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకర స్థాయిలో 135 దేశాలకు వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గత అంచనాలతో పోలిస్తే.. డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ అంచనాలకు మించి ‘డెల్టా’ వేరియంట్ రెట్టింపు వేగంతో వ్యాపిస్తోందని అలబామా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. 80 నుంచి 90 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తేనే ‘డెల్టా’ వేరియంట్ ను కట్టడి చేయవచ్చని, వ్యాక్సినేషన్ ను అన్ని దేశాలు ముమ్మరం చేయాలని సూచించారు.
చైనాలో తిరగబెట్టిన కేసులు..
ప్రపంచానికి చైనా.. ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను అందిస్తే.. అవి రూపు మార్చుకుని తిరిగి డెల్టా రూపంలో చైనాపైనే దాడి చేశాయి. ఓ దశలో పూర్తిగా కోలుకున్నట్టే కనిపించిన చైనా, ఇప్పుడు డెల్టా వేరియంట్ కోరల్లో చిక్కుకుంది. కరోనా ప్రారంభంలో సోకిన వైరస్ రకంతో పోలిస్తే ‘డెల్టా’ వేరియంట్ లో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు ఎక్కువగా ఉందని చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్ సులభంగా, వేగంగా వ్యాపిస్తూ.. ప్రమాదకరంగా మారినట్టు వెల్లడించారు. ప్రస్తుతం చైనాలోని 17 ప్రావిన్సుల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రఖ్యాత పర్యాటక నగరం ఝాంగ్ జియాజీలో లాక్ డౌన్ పెట్టారు.
భారత్ లో ఇలా..
భారత్ లో సెకండ్ వేవ్ లో అల్లకల్లోలానికి కారణమైన ‘డెల్టా’ వేరియంట్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్ల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ రాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలు పెట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పండగలు, పబ్బాల పేరుతో ఆంక్షలు సడలించి పరోక్షంగా కరోనా ఉధృతికి సాయపడుతున్నాయి.