Telugu Global
National

మోదీయా మజాకా..? టైమ్ చూసి పేరు మార్చారు..

భారత దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్న పేరును కేంద్రంమార్చేసింది. ఇకపై రాజీవ్ స్థానంలో మేజర్ ధ్యాన్ చంద్ అనే పేరు వస్తుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ ఖేల్‌ రత్న పేరును మేజర్ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌ లో పేర్కొన్నారాయన. […]

మోదీయా మజాకా..? టైమ్ చూసి పేరు మార్చారు..
X

భారత దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్న పేరును కేంద్రంమార్చేసింది. ఇకపై రాజీవ్ స్థానంలో మేజర్ ధ్యాన్ చంద్ అనే పేరు వస్తుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ ఖేల్‌ రత్న పేరును మేజర్ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌ లో పేర్కొన్నారాయన.

టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల హాకీ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం గెలుచుకోగా, మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఈ శుభ సందర్భంలో ధ్యాన్ చంద్ పేరుని ఖేల్ రత్న పురస్కారానికి జతచేసినట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. పనిలో పనిగా తమ ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే గౌరవాన్ని చూడండి అంటూ సోషల్ మీడియాలో మోదీని పొగిడేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు.

అయితే కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారంపై గుర్రుగా ఉంది. రాజీవ్ పేరుని తొలగించడంపై వారు ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరూ బయటపడలేదు. ఈ దశలో బయటపడితే ధ్యాన్ చంద్ ని అవమానించినట్టు అర్థం వస్తుంది కాబట్టి గుంభనంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మోదీపై జోకులు పేలుతున్నాయి. ధ్యాన్ చంద్ సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అని, వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నాయని, అందుకే మోదీ టైమ్ చూసి క్రీడలని రాజకీయాలకు వాడుకున్నారని సెటైర్లు పేలుస్తున్నారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 నుంచి ఖేల్ రత్న అవార్డుని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీనికింద ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం అందిస్తారు. ఈ ఏడాది నుంచి దీనిపేరు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మారుతుంది.

First Published:  6 Aug 2021 3:58 AM GMT
Next Story