ఇంద్రవెల్లి ఆత్మగౌరవ దండోరాను ఛాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్
18 నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఎమ్మెల్యే సీతక్కతో సహా ముఖ్య నేతలంతా ఏర్పాట్లలో బిజీ బిజీ ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల రక్తమోడిన చరిత్రాత్మక ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దెత్తున సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేశారు. […]
- 18 నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు
- ఎమ్మెల్యే సీతక్కతో సహా ముఖ్య నేతలంతా ఏర్పాట్లలో బిజీ బిజీ
ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల రక్తమోడిన చరిత్రాత్మక ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దెత్తున సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే సీతక్క సభ ఏర్పాటవుతున్న స్థలాన్ని పరిశీలించి, ఇంద్రవెల్లి పరిసర గ్రామాల్లో పర్యటించారు. అలాగే టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే జాగ్గారెడ్డి సభను విజయవంతం చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
కొమురం భీం మనుమడు సోనీరావ్ ఇటీవల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తన మద్దతు ప్రకటించాడు. ఇంద్రవెల్లి చుట్టుపక్కల ఉన్న అదిలాబాద్, ఖానాపూర్ వంటి ప్రాంతాల నుంచి పెద్దెత్తున టిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తుతోంది.
ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దాదాపు 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దండోరా కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ నాయకులు ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక రోజంతా పర్యటించనున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇతర పార్టీల నుంచి సర్పంచులు, ఎంపిటిసిలు, విద్యార్థి, యువజన నాయకులు చేరుతుండగా, త్వరలో జరుగనున్న రాహుల్ పర్యటన నాటికి ఇంకా పెద్ద స్థాయి నాయకులు చేరతారని భావిస్తున్నారు.
ఖానాపూర్- సీతక్క, ఆదిలాబాద్ -నర్సారెడ్డి, బోథ్-డాక్టర్ వంశీకృష్ణ, ఆసిఫాబాద్-పొదెం వీరయ్య, మంచిర్యాల -అనిల్‌కుమార్, ముథోల్-రాములు నాయక్, బెల్లంపల్లి-సిరిసిల్ల రాజయ్య, చెన్నూర్-అద్దంకి దయాకర్, ధర్మపురి-అన్వేష్ రెడ్డి, జగిత్యాల-లక్ష్మణ్, కోరుట్ల-మానవతారాయ్, బాల్కొండ-అనిల్ యాదవ్, ఆర్మూర్-అనిల్, పెద్దపల్లి-రాజ్‌ఠాకూర్, రామగుండం-దొమ్మాట సాంబయ్య, నిజామాబాద్-మోహన్‌రెడ్డిలకు బాధ్యత అప్పగించారు.