Telugu Global
National

మీ వాహనంపై చలానా ఉందా.. ఉంటే సీజ్ అయినట్లే..!

రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్లో వాహనాన్ని నడపడం, సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్ స్పీడ్ తో వాహనం నడపడం తదితర ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అక్కడికక్కడే ఫైన్ విధించి రసీదు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ -చలానా విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల ఫొటోలు తీసుకొని ఇంటికి, లేదా మొబైల్ నంబర్ కి చలానా పంపుతున్నారు. […]

మీ వాహనంపై చలానా ఉందా.. ఉంటే సీజ్ అయినట్లే..!
X

రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్లో వాహనాన్ని నడపడం, సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్ స్పీడ్ తో వాహనం నడపడం తదితర ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అక్కడికక్కడే ఫైన్ విధించి రసీదు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ -చలానా విధిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల ఫొటోలు తీసుకొని ఇంటికి, లేదా మొబైల్ నంబర్ కి చలానా పంపుతున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ పద్ధతి ద్వారా వాహనదారులు తమకు విధించిన జరిమానాను చెల్లించవచ్చు. అయితే చాలా మంది ఈ-చలానా విధించినప్పటికీ చెల్లించడం లేదు. దీంతో మూడు చలానాలు చెల్లించని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసేవారు.

ఇలా మూడు చలనాలకు అవకాశమిచ్చినా వాహనదారులు చలానా చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝలిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసులు నమోదు చేసి రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. కానీ చాలామంది వాహనదారులు చలానా చెల్లించలేదు.రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపడుతున్నారు. తమ తనిఖీల్లో ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చలానా చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారు ఇప్పటికైనా తమ వాహనాలకు విధించిన చలానాను చెల్లించకపోతే ఏకంగా వాహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

First Published:  4 Aug 2021 7:28 AM IST
Next Story