Telugu Global
Cinema & Entertainment

క్రేజీ మూవీలో సీనియర్ నటులు

శ‌ర్వానంద్, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ఆడాళ్లు మీకు జోహార్లు`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇటీవ‌ల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌హిళల‌ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శి భాగ‌మ‌య్యార‌ని లేటెస్ట్‌గా నిర్మాత‌లు ప్రకటించారు. ఇలా […]

క్రేజీ మూవీలో సీనియర్ నటులు
X

శ‌ర్వానంద్, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'ఆడాళ్లు మీకు జోహార్లు'. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇటీవ‌ల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌హిళల‌ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శి భాగ‌మ‌య్యార‌ని లేటెస్ట్‌గా నిర్మాత‌లు ప్రకటించారు. ఇలా ఒకే సినిమాలో ముగ్గురు సీనియర్ ఆర్టిస్టులు ఎంటరవ్వడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.

సినిమాలో మూడు కీలకమైన మ‌హిళా పాత్రలున్నాయి. ఆ పాత్ర‌ల‌ను చేయ‌డానికి చాలా అనుభ‌వం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవ‌స‌రం కావ‌డంతో మేక‌ర్స్..ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శిల‌ను ఆ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్నషూటింగ్‌లో వీరు ముగ్గ‌రు జాయిన్ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 Aug 2021 12:31 PM IST
Next Story