Telugu Global
Cinema & Entertainment

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప- ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప-ద రైజ్ […]

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా
పుష్ప. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప- ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప-ద రైజ్
థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ఏ తేదీకి అనే విషయాన్ని మాత్రం
మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

First Published:  3 Aug 2021 12:33 PM IST
Next Story