Telugu Global
Others

ఏపీలో మరో 2 నెలలు ఆంక్షలు..

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పొగురు రాష్ట్రాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో 2 నెలల పాటు కఠిన ఆంక్షలు అమలయ్యేలా చర్యలు చేపట్టింది. నైట్ కర్ఫ్యూని మరింతకాలం కొనసాగించే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక ఆదేశాలిచ్చారు. 2 నెలలపాటు కొవిడ్‌ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికార యంత్రాంగానికి […]

ఏపీలో మరో 2 నెలలు ఆంక్షలు..
X

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పొగురు రాష్ట్రాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో 2 నెలల పాటు కఠిన ఆంక్షలు అమలయ్యేలా చర్యలు చేపట్టింది. నైట్ కర్ఫ్యూని మరింతకాలం కొనసాగించే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక ఆదేశాలిచ్చారు.

2 నెలలపాటు కొవిడ్‌ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికార యంత్రాంగానికి సీఎం జగన్ సూచించారు. వివాహ వేడుకలను 150 మందికే పరిమితం చేయాలని, ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాలకోసం ప్రజలు గుంపులు గుంపులుగా పోగవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, వీటిపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.

టీచర్ల వ్యాక్సినేషన్ పై దృష్టి..
ఈ నెల 16వతేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆలోగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. 45 ఏళ్లు పైబడ్డవారు, గర్భిణిలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌ లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

ఏపీలో అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలే..
ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో వ్యాధి నిర్థారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు కూడా ర్యాపిడ్ టెస్ట్ లతో టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేయాలని సూచించారు సీఎం జగన్. కచ్చితమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఆలస్యం చేయకుండా చికిత్స మొదలు పెట్టొచ్చని చెప్పారు. ఇంటింటి సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి, వారిని హోమ్ ఐసోలేషన్ కి పరిమితం చేయడం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని అన్నారు. 104 సేవలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మరో 2 నెలలపాటు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు సీఎం జగన్.

First Published:  3 Aug 2021 1:43 AM IST
Next Story