సెప్టెంబర్ నుంచి శంకర్ సినిమా
శంకర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కాల్షీట్లు కేటాయించాడు. సెప్టెంబర్ 8 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన శంకర్.. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని కీలకమైన లొకేషన్లను లాక్ చేశాడు. ఆయా ప్రాంతాల్లో వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా వర్క్ లో బిజిగా ఉన్నాడు చరణ్. ఆ సినిమా పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఆ వెంటనే శంకర్ సినిమా […]
శంకర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కాల్షీట్లు కేటాయించాడు. సెప్టెంబర్ 8 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన శంకర్.. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని కీలకమైన లొకేషన్లను లాక్ చేశాడు. ఆయా ప్రాంతాల్లో వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా వర్క్ లో బిజిగా ఉన్నాడు చరణ్. ఆ సినిమా పనులన్నీ ఈ నెలాఖరుకు
పూర్తవుతాయి. ఆ వెంటనే శంకర్ సినిమా సెట్స్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నిర్మాత దిల్ రాజుకు సమాచారం అందించాడు చెర్రీ.
ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఆమె కూడా చరణ్-శంకర్ సినిమాకు కాల్షీట్లు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించే పనిని ఇప్పటికే మొదలుపెట్టాడు.