‘శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తాం’ మహారాష్ట్రలో మాటల యుద్ధం
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల బీజేపీ నేత ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ.. అవసరమైతే శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై శివ సైనికులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఏకంగా సీఎం ఉద్దవ్ థాక్రే స్పందించారు. థప్పడ్ సే డర్ నహీ లగ్తా ( చెంప దెబ్బకు భయపడం) అంటూ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్దవ్ థాక్రే మాట్లాడారు. ‘ కొంత మంది రెచ్చగొట్టే […]
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల బీజేపీ నేత ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ.. అవసరమైతే శివసేన కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై శివ సైనికులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఏకంగా సీఎం ఉద్దవ్ థాక్రే స్పందించారు. థప్పడ్ సే డర్ నహీ లగ్తా ( చెంప దెబ్బకు భయపడం) అంటూ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్దవ్ థాక్రే మాట్లాడారు.
‘ కొంత మంది రెచ్చగొట్టే భాషను మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్లకు మేం భయపడం. తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెబుతాం. బీజేపీ వాళ్లు బాల్ థాక్రేను అవమానించేలా మాట్లాడుతున్నారు. మేము రివర్స్ అటాక్ మొదలుపెడితే వాళ్లు తట్టుకోలేరు. శివసైనికుల సత్తా ఏమిటో బీజేపీ వాళ్లకు బాగా తెలుసు.’ అంటూ సీఎం ఉద్దవ్ థాక్రే కౌంటర్లు ఇచ్చారు.
ఇక ఈ విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఘాటుగా స్పందించారు. ‘బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమైన బీజేపీ నేతలు ఇలా చేయరు. మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్లు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. శివసేన భవన్‌ను కూల్చేయాలని బీజేపీ నాయకులు ఎన్నటికీ భావించరు’ అంటూ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు.అంతేకాక.. మహారాష్ట్రను మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయాలంటూ ఆయన పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు.
ఇక బీజేపీ నేతలు సైతం సంజయ్ రౌత్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రను మత్తు రహిత రాష్ట్రంగా చేయాల్సిన అవసరముందని వారు అన్నారు. తక్షణమే.. కళానగర్ ( సీఎం ఉద్దవ్ థాక్రే ఉంటున్న ప్రదేశం) నుంచే ఈ పని జరగాలంటూ వాళ్లూ వ్యాఖ్యానించారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.