Telugu Global
NEWS

మాస్క్​ లేకుంటే రూ.25 వేల ఫైన్​..

దేశంలో కరోనా థర్డ్​వేవ్​ ముంచుకొస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాదిన కరోనా ముప్పు ఎక్కువగా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళలో రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. అక్కడ లాక్​డౌన్​, కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కఠిన […]

మాస్క్​ లేకుంటే రూ.25 వేల ఫైన్​..
X

దేశంలో కరోనా థర్డ్​వేవ్​ ముంచుకొస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాదిన కరోనా ముప్పు ఎక్కువగా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళలో రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. అక్కడ లాక్​డౌన్​, కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మరోవైపు కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి.

కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్​ 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్​ ధరించేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మాస్క్​ పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలని భావిస్తున్నది.

కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మాస్క్ లేకుండా అనుమతిస్తే రూ.10 వేల నుంచి 25 వేల వరకూ భారీ జరిమానా విధించనుంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 నమూనాలు పరీక్షించగా 2,058 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్నటి కంటే పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 2,068 కేసులు నమోదవగా.. ఇవాళ 10 తక్కువగా 2,058 పాజిటివ్‌ తేలాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు డెల్టా వేరియంట్​ భయపెడుతున్నది. ఈ క్రమంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

First Published:  1 Aug 2021 2:51 AM GMT
Next Story