Telugu Global
NEWS

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన డీఏ

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనున్నది. 3.144 శాతం భత్యాన్ని(డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూలై నెల జీతాలు, పెన్షన్లు .. 2019 జనవరి నుంచి 2021 జూన్‌ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్‌ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) ఉన్న […]

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన డీఏ
X

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనున్నది. 3.144 శాతం భత్యాన్ని(డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జూలై నెల జీతాలు, పెన్షన్లు .. 2019 జనవరి నుంచి 2021 జూన్‌ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్‌ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా.. వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌(హెచ్‌ఆర్‌ఏ)ను మరో ఏడాది పొడిగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది.

ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కరించిందని వారు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు పడటం లేదని.. డీఏ కూడా పెంచలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వేతనాలు ఇవ్వడంలో స్వల్ప ఆలస్యం అయ్యింది. దీంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

First Published:  1 Aug 2021 7:54 AM IST
Next Story