Telugu Global
National

కోవాక్సిన్, కోవిషీల్డ్.. కలిపి ఇస్తే..? భారత్ లో ప్రయోగాలు మొదలు..

అవి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు. రెండూ వేర్వేరు టెక్నాలజీలతో తయారయ్యాయి. కానీ రెండూ పోరాడేది ఒకేరకమైన వైరస్ పై. మరి ఆ రెండు వ్యాక్సిన్లను కలిపి వేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఇది కేవలం ఊహలకే పరిమితం కాలేదు, దీనిపై పరిశోధనలకు కూడా ఆమోద ముద్ర పడింది. ప్రభుత్వ ఆమోదంతో తమిళనాడు వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఈ తరహా పరిశోధలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కోట్లమంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో […]

కోవాక్సిన్, కోవిషీల్డ్.. కలిపి ఇస్తే..? భారత్ లో ప్రయోగాలు మొదలు..
X

అవి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు. రెండూ వేర్వేరు టెక్నాలజీలతో తయారయ్యాయి. కానీ రెండూ పోరాడేది ఒకేరకమైన వైరస్ పై. మరి ఆ రెండు వ్యాక్సిన్లను కలిపి వేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఇది కేవలం ఊహలకే పరిమితం కాలేదు, దీనిపై పరిశోధనలకు కూడా ఆమోద ముద్ర పడింది. ప్రభుత్వ ఆమోదంతో తమిళనాడు వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఈ తరహా పరిశోధలు మొదలవుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కోట్లమంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య తక్కువ. ఈ దశలో వ్యాక్సినేషన్ తో వైరస్ కి చెక్ పెట్టాలంటే, అందరూ రెండు డోసులు తీసుకోవాలంటే మరింత సమయం పట్టే అవకాశముంది. దీనికి విరుగుడుగా ఒకేసారి రెండు డోసులు, అది కూడా రెండు వ్యాక్సిన్లను కలిపి వేయడంపై కొంతమంది శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ప్రభుత్వ అనుమతితో దీన్ని ఆచరణలోకి తెస్తున్నారు.

రెండు టీకాలను కలిపి ఒకే డోస్‌ గా వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై భారత నిపుణులు దృష్టిసారించారు. దీనిపై పరిశోధనలు జరిపేందుకు కేంద్ర ఔషధ నాణ్యతా నియంత్రణ మండలి వైద్యనిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో 300 మందిపై ప్రయోగాలు మొదలు కాబోతున్నాయి. వీరికి రెండు వ్యాక్సిన్‌ లను ఒకే డోస్‌ గా కలిపి వేయబోతున్నారు. ఈ ఫలితాలు తేలిన తర్వాత.. భారత్ లో జరుగున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఇప్పటికే భారత్ లో కొన్ని చోట్ల టీకా కొరత, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకాలు వేసిన ఉదాహరణలున్నాయి. అలాంటి వారు కూడా ఎలాంటి ప్రతికూల ఫలితాలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నారు. థాయ్‌ లాండ్‌ సహా కొన్ని దేశాల్లో ఈ రెండు టీకాలు కలిపి వేస్తున్నారు. రెండు టీకాలు కలిపివేస్తే మెరుగైన ఫలితాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో భారత్ లో ఈ తరహా ప్రయోగాలు ఊపందుకున్నాయి.

First Published:  31 July 2021 6:44 AM GMT
Next Story