సంక్రాంతి బరిలో మరో మూవీ
సంక్రాంతికి ఇప్పటికే 3 పెద్ద సినిమాలు రెడీ అయ్యాయి. ముందుగా సర్కారువారి పాట రిలీజ్ ప్రకటిస్తే, తాజాగా పవన్ కల్యాణ్-రానా సినిమా కూడా సంక్రాంతికొస్తుందని ఎనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను కూడా సంక్రాంతికే ప్రకటించారు. ఇలా ముగ్గురు పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. దీంతో మరో సినిమా ఇక పోటీకి రాదని అంతా అనుకున్నారు. కానీ నాలుగో సినిమావచ్చేసింది. మహేష్, పవన్, ప్రభాస్ సినిమాలకు పోటీగా ఎఫ్3 సినిమాను కూడా రిలీజ్ […]
సంక్రాంతికి ఇప్పటికే 3 పెద్ద సినిమాలు రెడీ అయ్యాయి. ముందుగా సర్కారువారి పాట రిలీజ్ ప్రకటిస్తే,
తాజాగా పవన్ కల్యాణ్-రానా సినిమా కూడా సంక్రాంతికొస్తుందని ఎనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను కూడా సంక్రాంతికే ప్రకటించారు. ఇలా ముగ్గురు పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. దీంతో మరో సినిమా ఇక పోటీకి రాదని అంతా అనుకున్నారు. కానీ నాలుగో సినిమావచ్చేసింది.
మహేష్, పవన్, ప్రభాస్ సినిమాలకు పోటీగా ఎఫ్3 సినిమాను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రేపోమాపో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వెంకటేష్ కూడా ఈ విషయాన్ని నిర్థారించాడు. ఎఫ్3 సినిమా సంక్రాంతికొచ్చి, నవ్వులు పూయిస్తుందని ప్రకటించాడు.
దీంతో సంక్రాంతి బాక్సాఫీస్ ఫుల్ అయినట్టయింది. ఇక తేదీలు చూసుకుంటే.. సర్కారువారి పాట జనవరి 13న వస్తోంది. రాధేశ్యామ్ సినిమా జనవరి 14న వస్తోంది. ఎఫ్3 సినిమాను 15న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక పవన్-రానా సినిమా అన్నింటికంటే ముందుగా 9 లేదా 10వ తేదీన వచ్చే ఛాన్స్ ఉంది. చూస్తుంటే.. రాబోయే సంక్రాంతి రంజుగా మారేలా ఉంది.