Telugu Global
International

అమెరికాలో మకాం కష్టమేనా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యల కోసం ఎక్కువ మంది అమెరికాకే వెళ్తుంటారు. మనదేశంలో కూడా బీటెక్ అవ్వగానే యూఎస్ కు వెళ్లే విద్యార్థులు వేలల్లో ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు కుడా అమెరికా అంటే మోజు ఎక్కువే.. అయితే ఇప్పుడు ఈ ఆశలకు చెక్ పెట్టేలా ఉంది అమెరికా ప్రభుత్వం. చదువుకోవడం కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడిపోవడం వల్ల అమెరికన్స్ కు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయనే వాదన ఎప్పటినుంచో ఉంది. అయితే ఆ వాదనే […]

అమెరికాలో మకాం కష్టమేనా?
X

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యల కోసం ఎక్కువ మంది అమెరికాకే వెళ్తుంటారు. మనదేశంలో కూడా బీటెక్ అవ్వగానే యూఎస్ కు వెళ్లే విద్యార్థులు వేలల్లో ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు కుడా అమెరికా అంటే మోజు ఎక్కువే.. అయితే ఇప్పుడు ఈ ఆశలకు చెక్ పెట్టేలా ఉంది అమెరికా ప్రభుత్వం.
చదువుకోవడం కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడిపోవడం వల్ల అమెరికన్స్ కు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయనే వాదన ఎప్పటినుంచో ఉంది. అయితే ఆ వాదనే రీసెంట్ గా మళ్లీ తెరపైకి వచ్చింది.

యూఎస్ కు వచ్చిన విద్యార్థులు చదువు పూర్తవ్వగానే తమ స్వదేశాలను తిరిగి వెళ్లాల్సిందేనని అమెరికా చట్ట సభలో వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు తేవాలంటున్నారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉంటూ ఉద్యోగం చేసుకోడానికి వీలుకల్పించే ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తి కాగానే తిరిగి తమ సొంత దేశాలకు బయలుదేరాల్సి ఉంటుంది.

First Published:  30 July 2021 8:49 AM IST
Next Story