Telugu Global
NEWS

రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళలో రెట్టింపు సంఖ్యలో కేసులు రావడంతో వీకెండ్ కర్ఫ్యూని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగించడానికి నిర్ణయించింది. పక్క రాష్ట్రం తెలంగాణలో గతంలోనే రాత్రి కర్ఫ్యూని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నా, ఏపీ మాత్రం ముందు జాగ్రత్తగా కర్ఫ్యూని కొనసాగిస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ […]

రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళలో రెట్టింపు సంఖ్యలో కేసులు రావడంతో వీకెండ్ కర్ఫ్యూని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగించడానికి నిర్ణయించింది. పక్క రాష్ట్రం తెలంగాణలో గతంలోనే రాత్రి కర్ఫ్యూని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నా, ఏపీ మాత్రం ముందు జాగ్రత్తగా కర్ఫ్యూని కొనసాగిస్తోంది.

ఏపీలో ప్రస్తుతం ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలులో ఉన్నాయి. రాత్రి 9నుంచి 10వరకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారికి అవకాశం ఉంది. రాత్రి 10 తర్వాత వీధుల్లో ఎవరూ తిరగకుండా పూర్తి స్థాయిలో నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ కేసులు ఏపీలో తగ్గుతున్న సమయంలో కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు సినిమా థియేటర్లకు అనుమతులు ఇస్తే రాత్రి కర్ఫ్యూ విషయంలో సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కర్ఫ్యూ కొనసాగించడానికే నిర్ణయించింది. రాత్రి 10 తర్వాత ఎవరూ బయట కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చింది.

ఆగస్ట్ 14వరకు నిబంధనల పొడిగింపు..
ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను ఆగస్ట్ 14వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలందాయి. థర్డ్ వేవ్ భయాలు పొంచి ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కర్ఫ్యూని ఎత్తివేసేందుకు సుముఖంగా లేదని స్పష్టమైంది.

First Published:  30 July 2021 10:23 AM IST
Next Story