Telugu Global
Others

ఈ సీజన్‌లో ఇవి మస్ట్!

వాతావరణం మార్పులను బట్టి మన శరీరంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. అందుకే ఒక్కో సీజన్‌లో ఒక్కోరకమైన సమస్యలు వస్తుంటాయి. అయితే దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సింపుల్‌గా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే కొన్ని ఐటమ్స్‌‌ కచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే.. లెమన్ అండ్ హనీ లెమన్ ప్రతీ సీజన్‌‌లో ఉపయోగపడుతుంది. రోజుని లెమన్, హనీ డ్రింక్ తో మొదలు పెడితే ఆ రోజంతా యాక్టివ్ గా […]

ఈ సీజన్‌లో ఇవి మస్ట్!
X

వాతావరణం మార్పులను బట్టి మన శరీరంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. అందుకే ఒక్కో సీజన్‌లో ఒక్కోరకమైన సమస్యలు వస్తుంటాయి. అయితే దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సింపుల్‌గా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే కొన్ని ఐటమ్స్‌‌ కచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే..

లెమన్ అండ్ హనీ
లెమన్ ప్రతీ సీజన్‌‌లో ఉపయోగపడుతుంది. రోజుని లెమన్, హనీ డ్రింక్ తో మొదలు పెడితే ఆ రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. నిమ్మలో ఉండే విటమిన్‌‌–సీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇది మంచి మందుగా పనికొస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్
వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీ యాక్సిడెంట్స్ విరుగుడుగా పని చేస్తాయి. అందుకే ఈ సీజన్ లో యాంటీ యాక్సిడెంట్ గుణాలు కలిగిన కాకరకాయను అప్పుడప్పుడు తింటుండాలి. అలాగే అల్లం, వెల్లుల్లిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంలంగా ఉంటాయి. రోజు వారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం మంచిది.

పెరుగు
ఇకపోతే మనలోనే ఉంటూ మనకు హెల్ప్ చేసే బ్యాక్టీరియాను ప్రొబ్యాక్టీరియా అంటారు. పెరుగు, మజ్జిగ, యోగర్ట్‌ లాంటి వాటి ద్వారా ఇవి లభిస్తాయి. ప్రోబయాటిక్స్‌ వల్ల ‌ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడుతుంది.

First Published:  30 July 2021 8:39 AM IST
Next Story