Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట ఫస్ట్ లుక్ రెడీ

మహేశ్‌బాబు కొత్త సినిమా `స‌ర్కారువారి పాట‌`. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘సర్కారువారి పాట’ టైటిల్, విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తాజాగా మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను (ఫస్ట్ లుక్) ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. […]

సర్కారువారి పాట ఫస్ట్ లుక్ రెడీ
X

మహేశ్‌బాబు కొత్త సినిమా 'స‌ర్కారువారి పాట‌'. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు పరశురామ్
దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 'సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం
హైదరాబాద్‌లో జరుగుతుంది.

‘సర్కారువారి పాట’ టైటిల్, విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తాజాగా
మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను (ఫస్ట్ లుక్) ఈ నెల 31న విడుదల చేయడానికి
చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. ఈ ఫ‌స్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో మహేశ్‌బాబు చేతిలో బ్యాగ్‌ పట్టుకుని ఉన్నారు. అదే విధంగా బైక్‌లు, కార్లులతో పాటు కొందమంది రౌడీల‌ను మ‌నం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ పోస్టర్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సంబంధించినది అని తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం
అందిస్తున్నాడు.

First Published:  29 July 2021 1:45 PM IST
Next Story