Telugu Global
NEWS

తరగతి గది బోధనకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా..?

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. మిగతా రాష్ట్రాల్లో కాలేజీలలో కదలిక మొదలైనా స్కూల్స్ విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పాక్షికంగా పాఠశాలలు తెరిచారు. అయితే అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులనుంచి స్పందన చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు తెరవాలా? వద్దా? అన్న విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నట్లు కేంద్ర వైద్య, […]

తరగతి గది బోధనకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా..?
X

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. మిగతా రాష్ట్రాల్లో కాలేజీలలో కదలిక మొదలైనా స్కూల్స్ విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పాక్షికంగా పాఠశాలలు తెరిచారు. అయితే అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులనుంచి స్పందన చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు తెరవాలా? వద్దా? అన్న విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు ఇటీవలే స్పష్టం చేశాయి.

ఆగస్ట్ లో కేసుల సంఖ్య మరింత తగ్గితే తరగతి గది బోధనపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ దశలో కేరళలో కేసుల సంఖ్య భారీగా పెరగడం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలను ఆలోచనలో పడేసింది. కేరళలో మూడో వేవ్ మొదలైందనే భయాలు వెంటాడుతున్నాయి. అటు హైదరాబాద్ లో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందనే వార్తలొస్తున్నాయి. ఇటు ఏపీలో సాక్షాత్తూ డిప్యూటీసీఎం కరోనా బారినపడటం కలకలం రేపింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కొవిడ్ మూడోవేవ్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఈ దశలో అసలు తల్లిదండ్రలు పిల్లల్ని స్కూల్స్ కి పంపేందుకు ఇష్టపడుతున్నారా లేదా అనేది సందేహంగా మారింది.

48శాతం పేరెంట్స్ వెనకడుగు..
ఇప్పటికిప్పుడు తమ పిల్లల్ని స్కూల్స్ కి పంపేందుకు దేశవ్యాప్తంగా 48శాతం మంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో తేలింది. కరోనా కేసులు మరింతగా తగ్గితే పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తామని 30శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. 21శాతం మంది మాత్రం ఎప్పుడు స్కూల్స్ తెరిస్తే, అప్పుడు పంపించేందుకు రెడీగా ఉన్నారట. దేశవ్యాప్తంగా 361 జిల్లాల్లో 32వేలమందిపై ఈ సర్వే జరిగింది.

టీకాలు వేయండి.. స్కూల్స్ తెరవండి..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాయి. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పేరెంట్స్ మాత్రం పిల్లల వ్యాక్సినేషన్ పూర్తయితేనే వారిని స్కూల్స్ కి పంపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి చిన్నారుల వ్యాక్సిన్ ఇంకా భారత్ లో అందుబాటులోకి రాలేదు. అది అందుబాటులోకి వచ్చి, టీకా కార్యక్రమం పూర్తయితే.. పిల్లల్ని స్కూల్స్ కి పంపించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

First Published:  29 July 2021 3:36 AM IST
Next Story