Telugu Global
Cinema & Entertainment

ఈవారం సినిమాలు.. ఒకేసారి 5

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లకు చలనం వచ్చింది. ఈ శుక్రవారం నుంచి నైజాంలో పూర్తిస్థాయిలో, ఏపీ-సీడెడ్ లో అక్కడక్కడ థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏకంగా 5 సినిమాలు పోటీపడుతుండడం విశేషం. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా 30న థియేటర్లలోకి వస్తోంది. లాయర్ రామచంద్రగా సత్యదేవ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అతడి సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కిందంటున్నాడు హీరో. ఇక తిమ్మరుసుకు పోటీగా […]

ఈవారం సినిమాలు.. ఒకేసారి 5
X

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లకు చలనం వచ్చింది. ఈ శుక్రవారం నుంచి నైజాంలో
పూర్తిస్థాయిలో, ఏపీ-సీడెడ్ లో అక్కడక్కడ థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏకంగా 5 సినిమాలు పోటీపడుతుండడం విశేషం.

సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా 30న థియేటర్లలోకి వస్తోంది. లాయర్ రామచంద్రగా సత్యదేవ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అతడి సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కిందంటున్నాడు హీరో.

ఇక తిమ్మరుసుకు పోటీగా తేజ సజ్జ నటించిన ఇష్క్ సినిమా సిద్ధమైంది. ఇది కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ప్రియాప్రకాష్ వారియర్ హీరోగా నటించిన ఈ సినిమా ఓ మలయాళ చిత్రానికి రీమేక్. ఈ వీకెండ్ కూసింత అంచనాలతో వస్తున్న సినిమాలు ఈ రెండే.

ఈ రెండు సినిమాలకు తోడుగా నరసింహపురం, పరుగెత్తు-పరుగెత్తు, త్రయం అనే మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుంది, ఏది ఫ్లాప్ అవుతుందనే చర్చ ఇక్కడ
అనవసరం. అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా అనేది మాత్రమే ప్రధానాంశం. ఇక ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లతో, అరకొర థియేటర్లతో ఈ సినిమాలు ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తాయనేది చర్చనీయాంశం.

First Published:  28 July 2021 10:50 AM IST
Next Story