రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకుంటే ఎన్నిరోజులు సేఫ్?
వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా మహమ్మారి ని పూర్తిగా ఎదుర్కోగలమా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయి. ఒకసారి కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఎక్కువ ఉంటాయా? లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయా? అన్న విషయంపై చాలా రోజులుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా విడుదలైన పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన వారికంటే .. వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలోనే యాంటీబాడీలు […]
వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా మహమ్మారి ని పూర్తిగా ఎదుర్కోగలమా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయి. ఒకసారి కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఎక్కువ ఉంటాయా? లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయా? అన్న విషయంపై చాలా రోజులుగా పరిశోధనలు సాగుతున్నాయి.
తాజాగా విడుదలైన పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన వారికంటే .. వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ కళాశాల ఈ మేరకు పరిశోధన జరిపింది. మొత్తం 2 వేల మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే యాంటీబాడీలు మూడు నుంచి నాలుగు నెలల తర్వాత క్షీణిస్తున్నాయని గుర్తించారు. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ కాలం యాంటీబాడీలు ఉంటున్నాయని పరిశోధనలో తేలింది.
90 శాతం వైద్యులు, పారామెడికల్ సిబ్బందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 68 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా 11 శాతం మంది ఒకడోసు తీసుకున్నారు. మరో 11 శాతం వ్యాక్సిన్ తీసుకోని వారిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు కనుగొన్నారు. రెండు డోసులు తీసుకున్న 5 శాతం మందిలో అసలు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని వైద్యులు గుర్తించారు.