Telugu Global
Health & Life Style

హెపటైటిస్‌తో జాగ్రత్త!

శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైన ఆర్గాన్. లివర్ ఒక్కటి హెల్దీగా ఉంటే చాలు శరీరం ఆటోమేటిగ్గా బాగుంటుంది. ఎందుకంటే శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, ఆహారంలోని విటమిన్స్‌ను శరీరానికి అందించేది లివరే కాబట్టి. మరి ఇలాంటి లివర్‌‌ను సరిగ్గా చూసుకోపోతే పెద్ద సమస్యలే తలెత్తుతాయి. హెపటైటిస్ ఇలాంటిదే.. లివర్‌పై తీవ్రమైన ప్రభావం చూపే వ్యాధి హెపటైటిస్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఏటా చాలామంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి గురించి […]

హెపటైటిస్‌తో జాగ్రత్త!
X

శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైన ఆర్గాన్. లివర్ ఒక్కటి హెల్దీగా ఉంటే చాలు శరీరం ఆటోమేటిగ్గా బాగుంటుంది. ఎందుకంటే శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, ఆహారంలోని విటమిన్స్‌ను శరీరానికి అందించేది లివరే కాబట్టి. మరి ఇలాంటి లివర్‌‌ను సరిగ్గా చూసుకోపోతే పెద్ద సమస్యలే తలెత్తుతాయి. హెపటైటిస్ ఇలాంటిదే..

లివర్‌పై తీవ్రమైన ప్రభావం చూపే వ్యాధి హెపటైటిస్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఏటా చాలామంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం.

కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీయగలిగే హెపటైటిస్ వ్యాధి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే వస్తుంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, నీటి కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మద్యపానం లాంటి వాటి కారణంగా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

శరీరంలో మలినాలు బాగా పెరిగిపోయినప్పుడు వాటిని క్లీన్ చేయడం కోసం కాలేయం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మద్యం తాగడం వల్ల లివర్‌‌పై ఇంకా ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇలా లివర్‌‌ను ఎక్కువ కష్టపెట్టినప్పుడు దాని పనితీరు మెల్లగా మందగిస్తుంది. అలాగే లివర్‌‌లోని కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా లివర్.. ఫ్యాటీ లివర్ గా మారుతుంది. ఒక్కోసారి లివర్ పనితీరు సక్రమంగా ఉన్నా.. ఎంజైమ్ విడుదలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. దీనినే హెపటైటిస్‌గా భావించొచ్చు. ఈ వ్యాధితో కాలేయం పనితీరు క్రమంగా అదుపు తప్పుతుంది. వ్యాధి తీవ్రత పెరిగితే ఫైనల్‌గా లివర్ ఫెయిల్ అవుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.

ఈ హెపటైటీస్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు. ఈ వ్యాధి వస్తే అలసట, విరోచనాలు, కామెర్లు, వాంతులు, కడుపు నొప్పి, బరువు తగ్గడం,కీళ్ల నొప్పులు, చర్మం, కళ్లు పచ్చగా మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స లేదు. చిన్న వయసులోనే టీకా వేయించుకోవచ్చు. ఒక వేళ వ్యాధి ముదిరినట్లయితే కాలేయం మార్పిడే ఒక్కటే ఆప్షన్.

First Published:  28 July 2021 3:30 AM GMT
Next Story