Telugu Global
Others

బ్యాటరీ లైఫ్ పెంచుకోండిలా..

చేతిలో ఫోన్ లేనిదే రోజు గడవని రోజులివి. కానీ, ఫోన్ బ్యాటరీ ఏమో ఊరికే అయిపోతుంటుంది. మరి దీనికి ఏది సొల్యూషన్.? ఇప్పుడొచ్చే స్మార్ట్ ఫోన్స్‌లో ఫీచర్స్ మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ర్యామ్, హై రెజల్యూషన్ కెమెరాలు, పెద్ద ప్రాసెసర్లు.. వీటి వల్ల మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ ను స్మార్ట్ గా వాడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ లైఫ్ ను కొన్ని సింపుల్ టిప్స్ తో పెంచుకోవచ్చు. అవేంటంటే.. […]

బ్యాటరీ లైఫ్ పెంచుకోండిలా..
X

చేతిలో ఫోన్ లేనిదే రోజు గడవని రోజులివి. కానీ, ఫోన్ బ్యాటరీ ఏమో ఊరికే అయిపోతుంటుంది. మరి దీనికి ఏది సొల్యూషన్.?

ఇప్పుడొచ్చే స్మార్ట్ ఫోన్స్‌లో ఫీచర్స్ మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ర్యామ్, హై రెజల్యూషన్ కెమెరాలు, పెద్ద ప్రాసెసర్లు.. వీటి వల్ల మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ ను స్మార్ట్ గా వాడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మొబైల్ బ్యాటరీ లైఫ్ ను కొన్ని సింపుల్ టిప్స్ తో పెంచుకోవచ్చు. అవేంటంటే..

బ్యాటరీ ఆప్టిమైజేషన్‌
మన మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గానే బ్యాటరీ ఆప్టమైజేషన్ ఉంటుంది. సెట్టింగ్స్ కు వెళ్లి అడాప్టివ్‌ బ్యాటరీ లేదా బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. ఈ సెట్టింగ్ మొబైల్‌లో ఎక్కువ చార్జింగ్ వాడుకునే యాప్స్ ను నిరోధిస్తుంది.

స్క్రీన్ బ్రైట్‌నెస్‌
బ్యాటరీ లైఫ్ తగ్గడానికి ప్రధాన కారణం స్క్రీన్. స్క్రీన్ బ్రైట్‌నెస్ అనేది ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీని వాడుకుంటుంది. అయితే బ్రైట్‌నెస్ అనేది లైటింగ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా మారేలా ‘ఆటో బ్రైట్‌నెస్’ ను ఎంచుకోవాలి. బ్రైట్‌నెస్ ఆటోలో ఉంచితే.. లైటింగ్‌ను బట్టే కాదు మొబైల్ బ్యాటరీని బట్టి కూడా అది బ్రైట్‌నెస్ ను అడ్జస్ట్ చేస్తుంది. అలాగే స్ర్కీన్‌ టైమ్‌ఔట్‌30 సెకండ్లకు తగ్గించుకుంటే బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది.

మల్టిపుల్ అకౌంట్లు
ఆండ్రాయిడ్‌ ఫోన్ గూగుల్ అకౌంట్‌తో సింక్ అయ్యి పని చేస్తుంది. అంటే మన సెట్టింగ్‌లు, యాప్‌లు ఇవన్నీ గూగుల్ అకౌంట్‌తో సింక్ అయ్యి పని చేస్తాయి. ఫోన్‌లో మల్టిపుల్ అకౌంట్లు ఉన్నప్పుడు ప్రతి అకౌంట్‌ సింక్‌ అయ్యేందుకు ఉపయోగించే ఇంటర్నెట్‌, కాంటాక్ట్‌లు వీటివల్ల బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే ఫోన్‌లో ఒకటి లేదా రెండు అకౌంట్లు ఉంటే మంచిది. మల్టిపుల్ అకౌంట్లు ఉంటే ఆటోమేటిక్ సింక్‌ను ఆఫ్ చేయడం బెస్ట్.

First Published:  28 July 2021 9:15 AM IST
Next Story