Telugu Global
National

కట్నం తీసుకుంటే ఉద్యోగం ఊడినట్టే..

డిగ్రీ విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకునే ముందు ‘కట్నం తీసుకోము’ అంటూ ఓ డిక్లరేషన్ ఇవ్వాలని ఇటీవలే కేరళ గవర్నర్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. భవిష్యత్ లో కట్నం తీసుకుంటే.. వారి డిగ్రీ సర్టిఫికెట్ రద్దవుతుందనేది ఆ డిక్లరేషన్ సారాంశం. గవర్నర్ ఆలోచన త్వరలో కార్యరూపందాలుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనతోపాటు ఇప్పుడు కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అవివాహితులనుంచి కూడా ఇలాంటి డిక్లరేషనే తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కట్నం తీసుకున్నట్టు […]

కట్నం తీసుకుంటే ఉద్యోగం ఊడినట్టే..
X

డిగ్రీ విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకునే ముందు ‘కట్నం తీసుకోము’ అంటూ ఓ డిక్లరేషన్ ఇవ్వాలని ఇటీవలే కేరళ గవర్నర్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. భవిష్యత్ లో కట్నం తీసుకుంటే.. వారి డిగ్రీ సర్టిఫికెట్ రద్దవుతుందనేది ఆ డిక్లరేషన్ సారాంశం. గవర్నర్ ఆలోచన త్వరలో కార్యరూపందాలుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనతోపాటు ఇప్పుడు కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అవివాహితులనుంచి కూడా ఇలాంటి డిక్లరేషనే తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కట్నం తీసుకున్నట్టు తేలితే.. వారిని ఉద్యోగాలనుంచి తొలగించేలా కేరళ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.

ఉద్యోగాల్లో చేరే అవివాహితులు జాయినింగ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికే ఉద్యోగంలో చేరిన అవివాహితులు తమ వివాహ సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలి. వివాహం జరిగిన నెలరోజుల లోపు ఆయా విభాగాల ఉన్నతాధికారులకు దాన్ని సమర్పించాలి. మా వివాహ సమయంలో కట్నం ప్రసక్తి లేదు అంటూ ఇచ్చే ఆ డిక్లరేషన్ లో భార్య సంతకం కూడా ఉండాలి. వారి తల్లిదండ్రుల సంతకం కూడా తప్పనిసరి. కేరళ ప్రభుత్వం ఇటీవల వరకట్న వేధింపుల కేసులపై ఎక్కువగా దృష్టిసారించింది. అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రంగా గుర్తింపు ఉన్న కేరళలో వరకట్న వేధింపుల కేసులు కూడా ఎక్కువే. అందుకే ప్రభుత్వం ఇలాంటి నూతన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ మచ్చ చెరిపేసుకోవాలని చూస్తోంది.

ప్రతి ఏడాది నవంబర్ 26న కేరళలో వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజు రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలు, ఇతర కార్యాలయాల్లో.. అందరిచేత కట్నం తీసుకోబోము అంటూ ప్రతిజ్ఞ చేయిస్తారు. ఉద్యోగుల డిక్లరేషన్ పేరుతో కేరళ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది.

First Published:  27 July 2021 5:33 AM IST
Next Story