Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?
Breakfast Skipping Effects: రోజు మొదలైన తర్వాత మనం ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్ ఫాస్ట్. శరీర ఆరోగ్యానికి బ్రేక్ ఫాస్ట్ అనేది ఎంతో కీలకం. కాని మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. అసలు అలా చేయడం మంచిదేనా? లేటుగా నిద్రలేవడం, ఆఫీస్ టైమ్ అవుతుందన్న తొందరలో ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా స్కిప్ చేస్తుంటారు. అలాగే మరికొంత మంది బరువు తగ్గాలనే ఆలోచనతో బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారరు.
రోజు మొదలైన తర్వాత మనం ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్ ఫాస్ట్. శరీర ఆరోగ్యానికి బ్రేక్ ఫాస్ట్ అనేది ఎంతో కీలకం. కాని మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. అసలు అలా చేయడం మంచిదేనా?
లేటుగా నిద్రలేవడం, ఆఫీస్ టైమ్ అవుతుందన్న తొందరలో ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా స్కిప్ చేస్తుంటారు. అలాగే మరికొంత మంది బరువు తగ్గాలనే ఆలోచనతో బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారరు. కానీ ఇలా చేయడం వల్ల చాలా రకాల సమస్యలొస్తాయంటున్నారు డాక్టర్లు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల కలిగే నష్టాలేంటంటే..
పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడంలో బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే వయసులో ఉన్న పిల్లలకు ఎదుగుదల మందగిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల రక్త హీనత వచ్చే అవకాశం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ పూర్తిగా మానేసినా లేదా లేటుగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మైగ్రేన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినే వారితో పోల్చితే తినని వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 27 శాతం ఎక్కువ.
బ్రేక్‌ఫాస్ట్ చేయని మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌ని తీసుకునే శక్తి తగ్గుతుంది. దానివల్ల పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా తలెత్తుతాయి.