Telugu Global
NEWS

యునెస్కో గుర్తింపుతో వచ్చే ప్రయోజనాలు ఏంటంటే..?

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ లో ఇలాంటి అరుదైన గౌరవాన్ని పొందిన 38 ప్రాంతాల సరసన రామప్ప దేవాలయం కూడా చేరింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఘనత రామప్ప దేవాలయానికి లభించినట్టయింది. అసలీ గుర్తింపుతో ఏమొస్తుంది..? కొత్తగా వచ్చే ఉపయోగాలేంటి..? – రామప్ప ఆలయం యునెస్కో పరిధిలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. – యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి […]

యునెస్కో గుర్తింపుతో వచ్చే ప్రయోజనాలు ఏంటంటే..?
X

తెలంగాణలోని రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ లో ఇలాంటి అరుదైన గౌరవాన్ని పొందిన 38 ప్రాంతాల సరసన రామప్ప దేవాలయం కూడా చేరింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఘనత రామప్ప దేవాలయానికి లభించినట్టయింది.

అసలీ గుర్తింపుతో ఏమొస్తుంది..? కొత్తగా వచ్చే ఉపయోగాలేంటి..?
– రామప్ప ఆలయం యునెస్కో పరిధిలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
– యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి.
– యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు క్యూ కడతారు. అంటే ఇకపై రామప్ప ఆలయానికి కూడా పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంటుంది. దేశీయ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. టూరిజానికి ప్రాధాన్యత పెరుగుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

గోల్కొండ కోట, చార్మినార్.. వీటికి ఎందుకు రాలేదు..?
నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి ఏపీ నుంచే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌ షాహీ సమాధులతో గతంలో ప్రతిపాదనలు వెళ్లాయి. హైదరాబాద్‌ కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి ప్రతిపాదన సమయంలోనే తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్‌ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్‌ కోట చుట్టూ కూడా భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటికి కూడా తిరస్కరణ ఎదురైంది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయానికి ఆ గుర్తింపు లభించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయం చుట్టూ బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది. దీంతో యునెస్కో గుర్తింపు సాధ్యమైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా..
యునెస్కో 1978 నుంచి ఇప్పటివర కు 1,126 కట్టడాలు, ప్రాంతాలకు వారసత్వ హోదా కల్పించింది. వీటిలో మూడు కట్టడాల నిర్వహణ యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని ఆ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం 167 దేశాల కు చెందిన 1,123 కట్టడాలు వారసత్వ జాబితాలో ఉన్నాయి. యునెస్కో గుర్తింపు పొంది న అత్యధిక కట్టడాలున్న దేశాల జాబితాలో భారత్‌ 5వ స్థానంలో ఉన్నది. అత్యధికంగా ఇటలీ నుంచి 57 కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. మన దేశంలో రామప్పతో కలిపి మొత్తం 39 కట్టడాలకు వారసత్వ హోదా దక్కింది. మొదటిసారిగా 1983లో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌ మహల్‌ కు వారసత్వ హోదా లభించింది. ఇప్పుడు వీటి సంఖ్య రామప్ప ఆలయంతో కలిపి 39కి చేరింది.

First Published:  25 July 2021 11:20 PM GMT
Next Story