Telugu Global
NEWS

ఏపీలో రాజీనామాల రాజకీయం..

దమ్ముంటే రాజీనామా చేయండి, ఉప ఎన్నికలకు సిద్ధపడండి, అంటూ ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని డిమాండ్ చేయడం సహజం. అందరం రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం మొదలు పెడతామని కూడా అప్పుడప్పుడూ మెలిక పెడుతుంటారు ప్రతిపక్ష నేతలు. తాజాగా ఏపీలో మరోసారి అలాంటి రాజీనామాల రాజకీయాన్ని మొదలు పెట్టింది టీడీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తారని, వైసీపీ వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు విశాఖ […]

ఏపీలో రాజీనామాల రాజకీయం..
X

దమ్ముంటే రాజీనామా చేయండి, ఉప ఎన్నికలకు సిద్ధపడండి, అంటూ ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని డిమాండ్ చేయడం సహజం. అందరం రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం మొదలు పెడతామని కూడా అప్పుడప్పుడూ మెలిక పెడుతుంటారు ప్రతిపక్ష నేతలు. తాజాగా ఏపీలో మరోసారి అలాంటి రాజీనామాల రాజకీయాన్ని మొదలు పెట్టింది టీడీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తారని, వైసీపీ వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా లేఖ రాస్తూ ఈ రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు టీడీపీనేతలంతా ఆయనకు వంతపాడుతున్నారు. మరోవైపు టీడీపీ రాజీనామాలకు మా పర్మిషన్ ఎందుకు.. హాయిగా చేసుకోండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సీనియర్లు సెటైర్లు పేలుస్తున్నారు.

అప్పట్లో అమరావతి, ఇప్పుడు విశాఖ..
గతంలో అమరావతి విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే రాజీనామాల డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు రెఫరెండం పెడతామన్నారు. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు రిజైన్ చేసి పోటీకి దిగాలని సవాల్ విసిరారు. రాష్ట్రమంతా చేయకపోయినా కనీసం ఆ మూడు జిల్లాల్లో అయినా చేయండి, లేకపోతే ఒక్క జిల్లాలో అయినా చేయండి అంటూ తన డిమాండ్లను తానే తగ్గించుకుంటూ వచ్చారు. చివరకు వైసీపీ అసలీ విషయాన్ని పట్టించుకోకపోయే సరికి డెడ్ లైన్ పెట్టిన చంద్రబాబు సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు మరోసారి విశాఖ ఉక్కు వ్యవహారంలో రాజీనామాల డిమాండ్లు ఊపందుకున్నాయి. రాజీనామాలతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోదని, కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే పార్లమెంట్ లో నిలబడి పోరాటం చేయాలంటున్నారు వైసీపీ నేతలు. గతంలో ప్రత్యేక హోదాకి మద్దతుగా తాము రాజీనామాలు అడిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు పారిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తమ్మీద పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మైలేజీకి చెక్ పెట్టేందుకే చంద్రబాబు రాజీనామాల అస్త్రాన్ని బయటకు తీశారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

First Published:  25 July 2021 10:58 PM GMT
Next Story