Telugu Global
National

గాలిని శుద్ధి చేసే ప్యూరిఫయర్ మాస్క్

మాస్క్ ఇప్పుడు మన డైలీ లైఫ్ లో భాగమైపోయింది. ఇంకెన్నాళ్లు మాస్క్ తో ఇలా సహజీవనం చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మాస్క్ ను సింపుల్ గా ఉంచ‌డం దేనికి? టెక్నాలజీ వరల్డ్ లో.. మాస్క్ కు కూడా స్మార్ట్ గా మార్చేస్తే పోలా! ఇదే ఐడియా వచ్చింది ఎల్ జీ కంపెనీ వాళ్లకి. అందుకే ఓ స్మార్ట్ మాస్క్ ను రూపొందించారు. ప్రస్తుతం మాస్క్ వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో మాస్కుల తయారీపై […]

గాలిని శుద్ధి చేసే ప్యూరిఫయర్ మాస్క్
X

మాస్క్ ఇప్పుడు మన డైలీ లైఫ్ లో భాగమైపోయింది. ఇంకెన్నాళ్లు మాస్క్ తో ఇలా సహజీవనం చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మాస్క్ ను సింపుల్ గా ఉంచ‌డం దేనికి? టెక్నాలజీ వరల్డ్ లో.. మాస్క్ కు కూడా స్మార్ట్ గా మార్చేస్తే పోలా! ఇదే ఐడియా వచ్చింది ఎల్ జీ కంపెనీ వాళ్లకి. అందుకే ఓ స్మార్ట్ మాస్క్ ను రూపొందించారు.

ప్రస్తుతం మాస్క్ వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో మాస్కుల తయారీపై అన్ని రకాల సంస్థలు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. టెక్స్ టైల్ సంస్థల నుంచి ఎలక్ట్రానిక్ సంస్థల వరకూ అన్ని రకాల కంపెనీలు మాస్క్ ల తయారీలో పడ్డాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ.. ఓ స్మార్ట్ ను రూపొందించింది. ప్యూరీకేర్‌ పేరుతో ఓ అధునాతన మాస్కును తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ మాస్క్ లో బిల్ట్‌ ఇన్‌ మైక్‌, స్పీకర్‌తో పాటు ఎయిర్ ను ప్యూరిఫై చేసే టెక్నాలజీని కూడా రూపొందించారు. 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్కులో 1000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ మాస్క్ 8 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎయిర్‌ ప్యూరిఫయిర్‌ స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 120 మంది థాయ్​లాండ్ అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఈ మాస్కులు అందించనున్నట్లు ఎల్‌జీ తెలిపింది. త్వరలోనే వీటిని మార్కెట్లోకి విడుదలు చేసే అవకాశం ఉంది.

First Published:  26 July 2021 10:20 AM IST
Next Story