Telugu Global
Cinema & Entertainment

హాలీవుడ్ సినిమాను తలపించిన ఎనిమి

టెక్నికల్ గా ఇండియన్ సినిమా ఎంతో డెవలప్ అయింది. మరీ ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలు కొత్త కొత్త టెక్నాలజీల్ని అందిపుచ్చుకొని దూసుకుపోతున్నాయి. ఈ కోవలోనే తెరకెక్కింది ఎనిమి సినిమా. విశాల్, ఆర్య హీరోలుగా నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తే, సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిందనే విషయం అర్థమౌతుంది. స్టైలీష్ లుక్‌లో విశాల్ ఎంట్రీతో ప్రారంభమైన ఒక నిమిషం న‌ల‌భై సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. […]

హాలీవుడ్ సినిమాను తలపించిన ఎనిమి
X

టెక్నికల్ గా ఇండియన్ సినిమా ఎంతో డెవలప్ అయింది. మరీ ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలు
కొత్త కొత్త టెక్నాలజీల్ని అందిపుచ్చుకొని దూసుకుపోతున్నాయి. ఈ కోవలోనే తెరకెక్కింది ఎనిమి సినిమా.
విశాల్, ఆర్య హీరోలుగా నటించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తే, సినిమా హాలీవుడ్
రేంజ్ లో తెరకెక్కిందనే విషయం అర్థమౌతుంది.

స్టైలీష్ లుక్‌లో విశాల్ ఎంట్రీతో ప్రారంభమైన ఒక నిమిషం న‌ల‌భై సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆధ్యంతం
ఆస‌క్తిక‌రంగా సాగింది. విశాల్, ఆర్య‌ల హై ఓల్టేజ్ యాక్ష‌న్ ప్యాక్డ్‌ పెర్‌ఫామెన్స్‌లు ఈ టీజ‌ర్‌కి హైలెట్‌గా
నిలిచాయి. ఇక టీజ‌ర్ చివ‌ర‌లో 'ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా…నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే ..'అని ప్ర‌కాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఈ టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది.

ఆర్‌ డి రాజశేఖర్ విజువ‌ల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చాయి. ఈ
టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. సెప్టెంబ‌రులో తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని
భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.

పదేళ్ల కిందట దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత విశాల్-ఆర్య క‌లిసి
న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌
మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

First Published:  25 July 2021 6:39 AM IST
Next Story