Telugu Global
International

డెల్టా వేరియంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్..

కొవిడ్ తొలి దశలో ఆల్ఫా వేరియంట్ తో జనం అవస్థలు పడ్డారు. అయితే సెకండ్ వేవ్ వచ్చాక డెల్టా వేరియంట్ ప్రభావం చూశాక, ఆల్ఫా నే నయం అనుకునే పరిస్థితి వచ్చింది. కొత్తగా మరిన్ని వేరియంట్ లు బయటపడుతున్నా కూడా డెల్టా వేరియంట్ మాత్రం అత్యంత డేంజరస్ అని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. కొవిడ్​ బారినపడి కోలుకున్న వారికి కూడా.. డెల్టా వేరియంట్ కారణంగా రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం ఉందని బ్రిటన్​ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. […]

డెల్టా వేరియంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్..
X

కొవిడ్ తొలి దశలో ఆల్ఫా వేరియంట్ తో జనం అవస్థలు పడ్డారు. అయితే సెకండ్ వేవ్ వచ్చాక డెల్టా వేరియంట్ ప్రభావం చూశాక, ఆల్ఫా నే నయం అనుకునే పరిస్థితి వచ్చింది. కొత్తగా మరిన్ని వేరియంట్ లు బయటపడుతున్నా కూడా డెల్టా వేరియంట్ మాత్రం అత్యంత డేంజరస్ అని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. కొవిడ్​ బారినపడి కోలుకున్న వారికి కూడా.. డెల్టా వేరియంట్ కారణంగా రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం ఉందని బ్రిటన్​ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ వేరియంట్‌ పై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డెల్టా..
డెల్టా వేరియంట్ తొలుత భారత దేశంలో ఎక్కువగా కనిపించినా.. ఆ తర్వాత బ్రిటన్ ని ముప్పతిప్పలు పెడుతోంది. దాదాపుగా భారత్ కొవిడ్ సెకండ్ ఫేజ్ నుంచి బయటకొస్తోంది. ఈ దశలో ఇక్కడ డెల్టా వేరియంట్ కేసులు తగ్గాయి, కొన్నిచోట్ల డెల్టా ప్లస్ అనే వేరియంట్ కనపడుతోంది. అయితే కేసుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం కాస్త సంతోషించదగ్గ విషయం. ఇక బ్రిటన్ విషయానికొస్తే, ప్రస్తుతం అక్కడ డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. బ్రిటన్ తో పాటు ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఈ కేసులు భారీగా బయటపడుతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కారణంగా రీ ఇన్‌ ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను హెచ్చరించింది​. అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సాధారణంగా కొవిడ్ బారినుంచి బయటపడినవారిలో యాంటీబాడీలు ఉత్పన్నం అయి కొన్నాళ్లపాటు వైరస్ ని ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ డెల్టా వేరియంట్ వల్ల రీ ఇన్ ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉందని అంటున్నారు బ్రిటన్ నిపుణులు.

‘ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ తో రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వేరియంట్ ని త్వరగా గుర్తించేందుకు ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాం. జాతీయ నిఘా విశ్లేషణలో వయసు, టీకా పంపిణీ వంటి వాటిని చేర్చాం. వైరస్​ రీ ఇన్​ ఫెక్షన్​ ముప్పు డెల్టా రకంతో ఎక్కువగా ఉందని గుర్తించాం. దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.’ అని ఇంగ్లండ్​ ప్రజారోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు.

ఇంగ్లండ్​లో గత వారం 33,716 డెల్టా కేసులు పెరిగాయని.. దాంతో దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 2,86,765 చేరినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్​-జూన్​ మధ్యలో నమోదైన కేసుల్లో 897 మందికి రెండోసారి వైరస్​ సోకినట్లు తేలింది. డెల్టా వేరియంట్ ని సమర్థంగా అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ఇక విదేశాలనుంచి వస్తున్న వారిలో బి.1.621 వేరియంట్ ను బ్రిటన్ గుర్తించింది. దీన్ని వేరియంట్​ అండర్​ ఇన్వెస్టిగేషన్ గా అధికారులు పేర్కొంటున్నారు.

First Published:  24 July 2021 8:45 PM GMT
Next Story