Telugu Global
Cinema & Entertainment

కొత్త కారులో ఎన్టీఆర్ తొలిసారి ఎక్కడికి వెళ్లాడు?

ఎన్టీఆర్ కొత్త కారు కొన్నాడు. లాంబోర్గినీ మొట్టమొదటి ఎస్ యూ వీ యూరిస్ ను తారక్ దక్కించుకున్నాడు. ఇది లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ కార్లను మాత్రమే అమ్మారు. అాలాంటి కారును 3 కోట్ల 15 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. తారక్ కోసం ప్రత్యేకంగా ఈ కారు ఇండియాకు దిగుమతి అయింది. మరి ఇలాంటి వెరీ వెరీ స్పెషల్ కారులో ఎన్టీఆర్ తొలిసారి ఎక్కడికి వెళ్లాడు? ఫస్ట్ టైమ్ లాంబోర్గినీని డ్రైవ్ చేస్తూ, తారక్ తన […]

కొత్త కారులో ఎన్టీఆర్ తొలిసారి ఎక్కడికి వెళ్లాడు?
X

ఎన్టీఆర్ కొత్త కారు కొన్నాడు. లాంబోర్గినీ మొట్టమొదటి ఎస్ యూ వీ యూరిస్ ను తారక్
దక్కించుకున్నాడు. ఇది లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ కార్లను మాత్రమే అమ్మారు.
అాలాంటి కారును 3 కోట్ల 15 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. తారక్ కోసం ప్రత్యేకంగా ఈ కారు
ఇండియాకు దిగుమతి అయింది.

మరి ఇలాంటి వెరీ వెరీ స్పెషల్ కారులో ఎన్టీఆర్ తొలిసారి ఎక్కడికి వెళ్లాడు? ఫస్ట్ టైమ్ లాంబోర్గినీని డ్రైవ్
చేస్తూ, తారక్ తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లాడు. ఆరెంజ్ కలర్ లో మెరిసిపోతున్న తన కొత్త
కారును రామ్ చరణ్ కు చూపించాడు. చరణ్ కు ఇదివరకే లాంబోర్గిని కంపెనీ కారు ఉంది. ఇద్దరూ కలిసి
కాసేపు కారు గురించి ముచ్చట్లు ఆడుకున్నారు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చేశాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కు ఇప్పటికే రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, స్కోడా కార్లు ఉన్నాయి. ఇప్పుడీ గ్యారేజీలోకి లాంగోర్గిని
వచ్చి చేరింది. అయితే పేరుకు కొత్త కారు కొన్నప్పటికీ.. ఎన్టీఆర్ కు ఇష్టమైన కారు మాత్రం రేంజ్ రోవర్.
అన్నట్టు ఎన్టీఆర్ ప్రతి కారుకు నంబర్ ఒకటే ఉంటుంది. అదే 9999. ఇది అతడి లక్కీ నంబర్.

First Published:  24 July 2021 12:12 PM IST
Next Story