Telugu Global
Cinema & Entertainment

పుకార్లు ఖండించిన ఖిలాడీ

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమాకు సంబంధించి 2 రోజులుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని, షూటింగ్ మధ్యలోనే ఆపేశారంటూ కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా హీరోకు, దర్శకుడికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా కొత్త షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తూ, కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా […]

పుకార్లు ఖండించిన ఖిలాడీ
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమాకు సంబంధించి 2 రోజులుగా కొన్ని పుకార్లు
వినిపిస్తున్నాయి. సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని, షూటింగ్ మధ్యలోనే ఆపేశారంటూ కథనాలు
వచ్చాయి. మరీ ముఖ్యంగా హీరోకు, దర్శకుడికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా కొత్త షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తూ, కొత్త పోస్టర్ కూడా
రిలీజ్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌
చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్లడిస్తూ చిత్రయూనిట్‌ ‘ఖిలాడి’ సినిమాలోని
రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్లో స్పోర్ట్స్‌ బైక్‌పై అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదిరి పోయేలా
కనిపిస్తున్నారు హీరో రవితేజ.

రవితేజ-రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కు ‘ప్లే స్మార్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌.
పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ గడ సమర్పణలో సినిమాను ఎ స్టూడియోస్, హవీష్‌ ప్రొడక్షన్స్‌
పతాకాలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రా భినయం
చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు
సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌ (ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌
తమ్ముడు) ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.

First Published:  24 July 2021 12:04 PM IST
Next Story