ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ ప్రారంభం..
ఆగస్ట్ 16నుంచి ఏపీలోని అన్ని పాఠశాలల్లో తరగతి గది బోధన మొదలు పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో నాడు-నేడు, అంగన్వాడీల నిర్వహణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తరగతుల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు తెరుచుకున్నా.. టీచర్లు మాత్రమే హాజరవుతున్నారు. రోజుమార్చి రోజు 50శాతం సిబ్బంది పాఠశాలలకు వెళ్తున్నారు. నాడు-నేడు పనుల పర్యవేక్షణ, ఆన్ […]
ఆగస్ట్ 16నుంచి ఏపీలోని అన్ని పాఠశాలల్లో తరగతి గది బోధన మొదలు పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో నాడు-నేడు, అంగన్వాడీల నిర్వహణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తరగతుల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు తెరుచుకున్నా.. టీచర్లు మాత్రమే హాజరవుతున్నారు. రోజుమార్చి రోజు 50శాతం సిబ్బంది పాఠశాలలకు వెళ్తున్నారు. నాడు-నేడు పనుల పర్యవేక్షణ, ఆన్ లైన్ బోధన ఏర్పాట్లు చూస్తున్నారు.
నాడు-నేడు పనులు ప్రజలకు అంకితం..
ఏపీలో తొలివిడత నాడు-నేడు పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. కరోనా సెలవలు కలసి రావడంతో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లన్నీ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆధునిక సొబగులద్దుకున్నాయి. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి సమకూర్చారు అధికారులు. ఈ పనులను ఆగస్ట్ 16న ప్రజలకు అంకితం చేయబోతున్నారు సీఎం జగన్.
టీచర్లందరికీ వ్యాక్సిన్..
ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన వారందరికీ రెండో డోసు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత స్కూల్ టీచర్లకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆగస్ట్ 16నాటికి ఏపీలోని టీచర్లందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల తరగతులు కూడా మొదలు కాబోతున్నాయి. ఈలోగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా యూజీసీ ఆదేశాలిచ్చింది. ఇటు ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ కూడా తిరిగి మొదలవుతాయి కాబట్టి.. ఏపీలో పాఠశాలలు, కళాశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడే రోజులు రాబోతున్నాయనమాట.