థర్డ్‌వేవ్ ముంచుకొస్తోంది
ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ సాగుతున్నా.. కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మనదేశంలో కూడా రోజువారి కేసుల సంఖ్య 40 వేలకు చేరువలో ఉంటోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో థర్డ్‌వేవ్‌పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలోని 68 శాతం మందికి కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ సాగుతున్నా.. కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మనదేశంలో కూడా రోజువారి కేసుల సంఖ్య 40 వేలకు చేరువలో ఉంటోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో థర్డ్‌వేవ్‌పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలోని 68 శాతం మందికి కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు.
ఇదిలా ఉంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో కేసులు అదుపులోకి రావడం లేదు.ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్‌వేవ్ విషయంలో నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా.. మరికొందరు మాత్రం థర్డ్‌వేవ్‌పై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు.
మరోవైపు థర్డ్‌వేవ్ వచ్చినా.. దాని ప్రభావం పెద్దగా ఉందని.. సాధారణ స్థాయిలో ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం .. కచ్చితంగా మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.కొందరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం మాస్కులు ధరించకుండా, జాగ్రత్తలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.