Telugu Global
Cinema & Entertainment

మరోసారి ఆగిపోయిన పుష్ప షూటింగ్

లాక్ డౌన్ కారణంగా ఓసారి ఆగిపోయిన పుష్ప సినిమా తాజాగా మరోసారి ఆగిపోయింది. ఈసారి దర్శకుడు సుకుమార్ అనారోగ్యం పాలయ్యాడు. అతడికి వైరల్ ఫీవర్. అయితే కరోనా లక్షణాల్లేవు. దీంతో పుష్ప షూటింగ్ కు 3 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత సుకుమార్ ఆరోగ్య పరిస్థితి మెరుగైతే సినిమా స్టార్ట్ అవుతుంది. లేదంటే మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు. నిజానికి కొన్ని సందర్భాల్లో దర్శకుడు లేకపోయినా, ఇలాంటి సందర్భాల్లో డైరక్షన్ టీమ్ […]

మరోసారి ఆగిపోయిన పుష్ప షూటింగ్
X

లాక్ డౌన్ కారణంగా ఓసారి ఆగిపోయిన పుష్ప సినిమా తాజాగా మరోసారి ఆగిపోయింది. ఈసారి దర్శకుడు సుకుమార్ అనారోగ్యం పాలయ్యాడు. అతడికి వైరల్ ఫీవర్. అయితే కరోనా లక్షణాల్లేవు. దీంతో పుష్ప షూటింగ్ కు 3 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత సుకుమార్ ఆరోగ్య పరిస్థితి మెరుగైతే సినిమా స్టార్ట్ అవుతుంది. లేదంటే మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు.

నిజానికి కొన్ని సందర్భాల్లో దర్శకుడు లేకపోయినా, ఇలాంటి సందర్భాల్లో డైరక్షన్ టీమ్ సహాయంతో పని కానిస్తారు. కాకపోతే ఆ టైమ్ లో హీరోతో లింక్ అయిన సన్నివేశాలుంటే మాత్రం డైరక్టర్ ఉండాల్సిందే. పుష్ప విషయంలో అదే జరిగింది. బన్నీతో సీన్స్ తీయాల్సిన టైమ్ లో సుకుమార్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో పుష్ప షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగా తొలి భాగం విడుదల ఆలస్యమౌతోంది. ఈ ఏడాది విడుదలవ్వడం అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయితే తప్ప పుష్ప పార్ట్-1 రిలీజ్ పై క్లారిటీ రాదు.

First Published:  22 July 2021 9:58 AM
Next Story