ఆహాలో వీకెండ్ మరో 2 సినిమాలు
ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న ఆహా యాప్.. ఈ వీకెండ్ కూడా మరో 2 డబ్బింగ్ సినిమాలు రెడీ చేసింది. వాటి పేర్లు నీడ, హీరో. రేపు, ఎల్లుండి వరుసగా స్ట్రీమింగ్ కు వస్తున్న ఈ సినిమాల సంగతేంటో చూద్దాం. నయనతార లీడ్ రోల్ పోషించిన సినిమా నీడ. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఓ మహానగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. నితిన్ అనే స్కూలుకు వెళ్లే పిల్లాడి కోణంలో ఈ సినిమాకథను వివరించారు. అతని చుట్టూ జరిగిన […]
ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న ఆహా యాప్.. ఈ వీకెండ్ కూడా మరో 2 డబ్బింగ్ సినిమాలు రెడీ చేసింది. వాటి పేర్లు నీడ, హీరో. రేపు, ఎల్లుండి వరుసగా స్ట్రీమింగ్ కు వస్తున్న ఈ సినిమాల సంగతేంటో చూద్దాం.
నయనతార లీడ్ రోల్ పోషించిన సినిమా నీడ. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఓ మహానగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. నితిన్ అనే స్కూలుకు వెళ్లే పిల్లాడి కోణంలో ఈ సినిమాకథను వివరించారు. అతని చుట్టూ జరిగిన పలు హత్యలను అతను వివరిస్తాడు. మేజిస్ట్రేట్ జాన్ బేబీతో సహా అందరినీ ఆ కథనాలు అబ్బురపరుస్తాయి. అయితే జాన్‌కు ఈ కథల మధ్య ఉన్న లింకులు పట్టుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఈకేసును చేధించడానికి అతను ఎలా ముందుకెళతాడు? అనేదే సినిమా.
'హీరో' సినిమా విషయానికి వస్తే యాక్షన్, కామెడీ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రమిది. ఓ క్షురకుడు ఓ ప్రమాదకారి అయిన గ్యాంగ్‌స్టర్ ఇంట్లోని తన మాజీ ప్రేయసిని కలుస్తాడు. వారిద్దరూ ఆ గ్యాంగ్‌స్టర్, అతని అనుచరులను ఎదిరించి ఇంటి నుంచి బయటపడటానికి చేసే పనులు ప్రేక్షకులకు నవ్వును తెప్పిస్తాయి. మరి వారిని విధి ఎక్కడికి తీసుకెళుతుంది? అనేదే సినిమా.