Telugu Global
Cinema & Entertainment

దేవిశ్రీ చేతికి మరో క్రేజీ మూవీ

శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. తమన్ తో పోలిస్తే దేవిశ్రీకి […]

దేవిశ్రీ చేతికి మరో క్రేజీ మూవీ
X

శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు
మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో
శర్వానంద్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ
కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు
అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

తమన్ తో పోలిస్తే దేవిశ్రీకి కాస్త హవా తగ్గింది. కానీ కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని సెలక్ట్
చేసుకుంటున్నాడు డీఎస్పీ. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా ఇలాంటిదే. కిషోర్ తిరుమలతో
దేవిశ్రీ వర్క్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు చిత్రలహరి సినిమాకు వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు.

‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌
ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌
సారంగ్‌ సినిమాటోగ్రాఫర్. శర్వానంద్-రష్మిక కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇదే.

First Published:  22 July 2021 3:23 PM IST
Next Story